సర్వర్ డౌన్ తో…. ప్రజల గోస
తాసిల్దార్ కార్యాలయంలో 4 రోజులు గడిచిన నేటి వరకు అందని… సర్వార్ సేవలు. ఎండలో… ప్రజల్లో నిరాశ..
సూర్యాపేట ప్రతినిధి జూన్ 15 నిజం చెబుతాం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కుల వృత్తులకు ఆర్థిక భరోసా కల్పించిన లక్ష్యముతో కుల వృత్తుల జాతుల వారికి లక్ష రూపాయలు పథకం ప్రవేశపెట్టారు. దీనితో సంబంధిత కులవృత్తుల వారు సంబంధిత కులం ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం మండలంలోని తాసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి నమోదు తీసుకున్నారు .
దీనితో కొంతమందికి ధ్రువీకరణ పత్రాలు రాగా 500 కు పైగా దరఖాస్తులు, ఆన్లైన్ జరగకపోవడంతో, గత నాలుగు రోజుల నుండి సర్వార్ పూర్తిగా డౌన్ కావడంతో, ఎండల్లోనే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
సంబంధిత పత్రాలు ఎప్పుడు వస్తాయో… రావో … ఈ గోసా ఏంది ఎండలో మాకు అని వాపోతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, సర్వర్ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజలకు నష్టం కలగకుండా ఉండుటకు కృషి చేయాలని వివిధ పార్టీ నాయకులు, దరఖాసుదారులు కోరుతున్నారు.
Also read: వెస్టిండీస్ సిరీస్‌తో ముగియనున్న రోహిత్ కెప్టెన్సీ..?
తెలంగాణ రాష్ట్రంలోని తాసిల్దార్ కార్యాలయాలు గడిచిన నాలుగు రోజుల నుండి సర్వర్ డౌన్ కావడం విషయం నిజమే. సమస్యను పరిష్కరించుటకు సంబంధిత టెక్నికల్ సిబ్బంది ఎల్లవేళల కృషి చేస్తున్నట్లు, తుంగతుర్తి తాసిల్దార్ రాంప్రసాద్ నిజం చెబుతాం న్యూస్ తో ఫోన్లో మాట్లాడారు…