Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వెస్టిండీస్‌ సిరీస్‌తో ముగియనున్న రోహిత్ కెప్టెన్సీ..?

రోహిత్‌పై పెరుగుతున్న ఒత్తిడి
వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం జట్టుపై గట్టిగానే పడనుంది.  36 ఏళ్ల రోహిత్‌ శర్మ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఇక ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదనే చర్చ సాగుతోంది. బహుశా వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ అతడి నాయకత్వానికి చివరిది కావచ్చని సమాచారం.

రోహిత్‌ కరీబియన్‌ టూర్‌లో కచ్చితంగా భారీ స్కోర్లు సాధించాల్సిన అవసరం ఉంది. లేకుంటే బీసీసీఐ అతడిపై కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉంటుంది.

ఇది కూడా చదవండి…..వచ్చే రెండేండ్లలో భారత్ ఆడే టెస్ట్ మ్యాచ్ లు ఇవే

ప్రస్తుతానికైతే శివ్‌సుందర్‌ దాస్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ బ్యాటింగ్‌ ఫామ్‌ను చూశాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. అలాగే విండీస్‌తో సిరీస్‌ ముగిశాక డిసెంబరు వరకు మరే టెస్టులు లేవు.

ఆ తర్వాతే జట్టు దక్షిణాఫ్రికాకు వెళుతుంది. కాబట్టి అప్పటి వరకు కొత్త సారథి ఎంపికపై చర్చించేందుకు సెలెక్టర్లకు కావాల్సినంత సమయం ఉంటుంది. వాస్తవానికి టెస్టు కెప్టెన్సీని తీసుకునేందుకు అప్పట్లోనే రోహిత్‌ సుముఖంగా లేడు.

కానీ అప్పటి బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా ఒత్తిడి మేరకు అంగీకరించాడు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

2022లో జట్టు పగ్గాలు చేపట్టాక భారత్‌ 10 టెస్టులు ఆడగా రోహిత్‌  ఆడిన ఏడు టెస్టుల్లో చేసింది 390 పరుగులు మాత్రమే. ఇందులో ఒక సెంచరీ ఉండగా..ఒక్క  50 కూడా లేదు