Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వచ్చే రెండేండ్లలో భారత్ ఆడే టెస్ట్ మ్యాచ్ లు ఇవే

మూడవ ఎడిషన్‌ డబ్ల్యూటీసీ 2023-2025  షెడ్యూల్‌ విడుదల అయింది.
వచ్చే నెల జూలై నుంచి మూడవ ఎడిషన్‌ ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 2023-2025  రెండు సంవత్సరాల్లో టీం ఇండియా ఆయా దేశాల జట్లతో తలపడనుంది. డబ్ల్యూటీసీ 2023-2025 షెడ్యూల్‌ ఇలావుంది.

మొదట వెస్టిండీస్‌ జట్టుతో టీం ఇండియా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ వచ్చే నెలలో వెస్టిండీస్‌కు వెళ్లనుంది. జూలై 12-16 తేదీల మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు, జూలై 20-24 తేదీల్లో ట్రినిడాడ్‌ వేదికగా రెండో టెస్ట్‌ జరగనుంది.

ఇది కూడా చదవండి….ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడమే కష్టం

దక్షిణాఫ్రికాలో టీం ఇండియా పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 2023, జనవరి 2024లో 2 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటించ నుంది. జనవరి, ఫిబ్రవరి 2024లో 5 టెస్టుల సీరిస్‌ జరుగనుంది.

భారత్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన సందర్భంగా సెప్టెంబర్-అక్టోబర్‌ 2024లో రెండు టెస్టులు ఆడనుంది. భారత్‌లో న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా అక్టోబర్‌- నవంబర్‌ 2024లో 3 టెస్టులు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఆస్టేల్రియాలో భారత్‌ పర్యటనలో భాగంగా నవంబర్‌ 2024- జనవరి 2025లో 5 టెస్టులు ఆడనుంది.