Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బంక్ ల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలివే

మానవత్వం మరిచిన పెట్రోల్ బంకు సిబ్బంది

కాటారం (భూపాలపల్లి) జూన్ 14 (నిజం చెబుతాం)

వృద్దులనీ చూడకుండా నీళ్లు త్రాగుచుంటే వద్దన్న వైనం
వివరాల్లోకి వెళితే!
మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కాటారం మండలం గారెపల్లి లోని చింతకాని క్రాస్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంకు వద్దకు పెట్రోల్ కొట్టించేందుకు తమ కొడుకుతో పాటు ఆ తల్లిదండ్రులు పెట్రోల్ బంకు కు చేరుకున్నారు.

పెట్రోలు స్టాక్ లేనందున కొద్దిసేపు అక్కడే ఆగి ఉన్నారు. అసలే ఎండ ఎక్కువగా ఉంది దాంతో పెద్దావిడకి దాహం వేయడంతో పెద్దాయన బాటిల్ తీసుకొని నీళ్లు పటుతుంటే బంకు సిబ్బంది వద్దని వారించారు. బయట రెండు రూపాయలకు దొరుకుతాయి ఇక్కడ ఎవరు తాగమన్నారు. అని వారితో దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దాంతో ఆ పెద్దలు బాధతో వెనదిరిగారు.

అక్కడ తన కుమారుడు కల్పించుకొని సిబ్బందితో అన్నా తాగితే ఏమవుతుంది గుక్కడు నీళ్లే కదా! అని అంటే అందులో ఒక సిబ్బంది, ఏం ఒర్రుతున్నావ్ నీకేం పని మీ ఇంటికాడ వెళ్లి అరువు, ఇక్కడ నుంచి వెల్లు అని వారితో దురుసుగా ప్రవర్తించాడు.ఇక వారు చేసేదేమీ లేక అక్కడనుండి బాదతో వెళ్లిపోయారు.

కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయంలో చాలా చర్చ నడుస్తుంది. ప్రతి లీటర్ పై వ్యాట్ రూపంలో చెల్లిస్తున్న రుసుముతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలామందికి తెలియదు. ఒకరిద్దరూ ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిన విషయమే.
బంకుల వద్ద వినియోగధారులకు కొన్ని ఖచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలను ఏ పంపుల లోనైనా అందించకపోతే వినియోదారులు చమురు సంస్థలకు ఫిర్యాదు చెయ్యొచ్చు.

ఇది కూడా చదవండి….విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం
1. స్వచ్ఛమైన తాగునీరు బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం బంక్ డీలర్. ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంటుంది. ఏ బంకులో కూడా తాగునీటి వసతి సౌకర్యం లేకపోయినా, తాగునీరును వద్దని ఎవరైనా వాదించిన వారిపై చమురు మార్కెటింగ్ సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చును.
2.మూత్రశాలలు మరుగుదొడ్లు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుచోట్ల వీటిని ఏర్పాటు చేసిన వినియోగించేందుకు నిర్వాహకులు అనుమతించడం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది.

బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు మూత్రశాలలకు చెల్లిస్తున్నాం.

3. ఆపద వేల ఫోన్ సదుపాయం అత్యవసర పరిస్థితుల్లో ఫోను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే.

4. ఉచితంగా గాలి నింపాల్సిందే టైర్లలో గాలి నింపటానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయకున్నా , వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనిఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నాయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ట్యూబ్ లెస్ టైర్లు వస్తున్నాయి వాటిలో నైట్రోజన్ నింపాలి.

5. ఫిర్యాదుల పెట్టి ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి అందులో వినియోగదారు తమ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్టు సౌకర్యం ప్రతి బంకు వద్ద ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది.

6.నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్ డీజిల్ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యతను పరీక్షించేందుకు హక్కు మనకు ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ తక్కువగా వస్తుందని అనుమానాలు వచ్చిన పరీక్షించుకోవచ్చు.

7. అధికారుల పర్యవేక్షణ కరువు బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడా, ఏ ఒక్కటి కూడా కల్పించడం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునేవారు లేరు ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

8. అవగాహన కల్పించాలి బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగదారు వినియోగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమరుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం.

పెట్రోల్ బంకు యజమానులు తమ సిబ్బందికి అవగాహన కల్పించి, వినియోగదారులతో మాట్లాడే విధానం మరియు మంచినీటి ఏర్పాటు కు కూడా వినియోగదారు నుంచి సుంకం వసూలు చేయడం జరుగుతుందని, ఇకనుండి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది పై చర్య తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.