Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం

డ్రోన్ యంత్రం ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే

బోయినిపల్లి, జూన్ 14 (నిజం చెపుతాం);

రెండు,మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగంలోకి పురుగుమందుల పిచికారీ కోసం ప్రవేశించిన డ్రోన్‌ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది.ఇప్పుడు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక గ్రామాల్లో రైతులు మక్క,ఇతర పంటల్లో డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.

బోయినిపల్లి మండల కేంద్రంలోని నల్లగొండ వేణు అనే రైతు డ్రోన్ కొనుగోలు చేయగా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావుతో కలిసి దానిని ట్రయల్ రన్ చేసి ప్రారంభించారు.

ఇది కూడా చదవండి….ప్రేమ పేరుతో మరో పెళ్లి…అరెస్ట్
ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఇటు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ సంస్థలు కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని,దీంతో డ్రోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నారని,కొందరు ఔత్సాహిక దళిత రైతులు కూడా దళితబంధు పథకంలో డ్రోన్లను కొనుగోలు చేసి, కిరాయికి నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు.

డ్రోన్‌లను వినియోగించి పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు కనిపించడంతో దీన్ని వాడేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎకరాలకు డ్రోన్‌ ద్వారా మందును స్ప్రే చేయవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, రైతు సమన్వేయ సమితి అధ్యక్షులు కోనుకటి లచ్చిరెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ జిల్లా అధ్యక్షులు తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మానువాడ సింగిల్ విండో అధ్యక్షులు వేసి రెడ్డి దుర్గ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జూ, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపిటిసి సంబ బుచ్చమ్మ, వ్యవసాయ అధికారిని ప్రణీత, ఆయా గ్రామాల సర్పంచ్ లు ,ఎంపిటిసి లు, నాయకులుతదితరులు ఉన్నారు.