Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రేమ పేరుతో మరో పెళ్లి…అరెస్ట్

రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి అరెస్ట్

కమలాపూర్ జూన్ 14 ( నిజం చెపుతాం) తన మాయమాటలతో ఒక అమాయకు రాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచిన ఒక ప్రబుద్ధుడు రెండో పెండ్లికి సిద్ధమైన ఘటన మండలంలోని ఉప్పల్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

మొదటి భార్య  కావ్య తెలిపిన ప్రకారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకు చెందిన ఎడకాటి సాయి తన చెల్లి స్నేహితురాలైన కావ్యతో పరిచయం ఏర్పరచుకొని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచి మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన దండబోయిన అంజలితో వివాహానికి సిద్ధమయ్యాడు.

ఇది కూడా చదవండి….గాజులరామారం సర్కిల్ -26 లో అక్రమ షెడ్ల నిర్మాణం

విషయం తెలుసుకున్న మొదటి భార్య కావ్య కౌటాల పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు మరియు గ్రామ సర్పంచ్ అయిన దేవేందర్ రావు గారి సహకారంతో రెండో పెళ్లికి సిద్ధమైన సాయిని విచారించగా నిజాన్ని ఒప్పు కోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మాయ మాటలు చెప్పి ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో చెలగాటం మాడుతున్న సాయిని శిక్షించాలని మహిళా సంఘాలు మరియు గ్రామస్తులు పోలీసులను కోరారు