Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గాజులరామారం సర్కిల్ -26 లో అక్రమ షెడ్ల నిర్మాణం

పుట్టగొడుగుల్లా అక్రమ షెడ్ల నిర్మాణం చేస్తున్నప్పటికీ తమకు అక్రమ సొమ్మే ముఖ్యమనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..

కుత్బుల్లాపూర్: జూన్ 14 (నిజం న్యూస్)

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 26 డివిజన్లో పుట్టగొడుగుల్లా అక్రమ షెడ్లు నిర్మాణం , యదేచ్చగా టౌన్ ప్లానింగ్ ఎస్ఓల కనుసన్నల్లో జరగడం నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేగుతోంది.

జిహెచ్ఎంసి కి రావాల్సిన ఆదాయాన్ని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం స్థానిక ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తుంది. ఒక ప్రభుత్వ అధికారిగా అక్రమ కట్టడాలను నిలిపివేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ తమకేం పట్టదు అన్నట్లు వ్యవహరించి అక్రమార్చనకు అలవాటు పడ్డారు.

కుత్బుల్లాపూర్ లో ఉత్తిత్తి కూల్చివేత్తలు పరంపర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో అక్రమార్కులు నిర్మిస్తున్న కట్టడాలపై పలువురు అధికారులు దృష్టికి తీసుకు వెళితే ఉత్తిత్తి కూల్చివేతలు చేస్తున్నట్లు బట్టబయలవుతోంది. ఒక్కో షెడ్ నిర్మాణానికి లక్షల్లో వసూలు చేస్తూ… అక్రమ షెడ్లను కూల్చుతున్నామని చెప్పి కేవలం ఫోటోలు ఫోజులు ఇవ్వడం పరిపాటిగా మారిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…..అప్పట్లోనే అత్యధిక వీక్షణలతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ లో రామాయణం

ఆదాయానికి మించిన ఆస్తులున్న… అడిగేది ఎవరు…

పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఓ ఎస్ ఓ కు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు. ఎంత దొరికితే అంతన్నట్లు దొరికిన కాడికి దోచుకుంటున్న సంబంధిత ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం ప్రజలు త్వరలో ఫిర్యాదులు చేయనున్నట్లు సమాచారం. ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో ఉండే హైయర్ ఆఫీసర్స్ ఈ విషయంపై స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.