Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అప్పట్లోనే అత్యధిక వీక్షణలతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ లో రామాయణం

రేడీయో..టీవీ అందుబాటులో ఉన్న రోజుల్లో రామానంద్‌ సాగర్‌ ఎంతో శ్రమించి రామాయణం ధారావాహిక ని తెరకెక్కించారు. 78 ఎపిసోడ్లు. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31వరకూ ప్రతీ ఆదివారం ఉదయం 9.30 గంటల కు దూదర్శన్‌ లో ప్రసారమయ్యేది.

అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు కు ఎక్కింది.అప్పటికే రామాయణం ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చినా ఆ ప్రభావం ఎక్కడా సీరియల్‌ పై పడలేదు. ఈ ఇతిహాసం ఎన్నిసార్లు విన్నా..ఎన్నిసార్లు చూసినా
కొత్తగానే అనిపిస్తుందని ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

ఇది కూడా చదవండి…అవతార్‌ సిరీస్‌ వాయిదా

2020 లో నూ రామాయణం సీరియల్‌ రీ టెలికాస్ట్‌ కానుందని తెలిసి కొందరు విమర్శించారు. లాక్‌ డౌన్‌ కారణంగా మళ్లీ రామాయణం ప్రసారం చేస్తే బాగుంటుందని కేంద్ర సమాచార.. ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మూడేళ్ల క్రితం ’రామాయణం’ సీరియల్‌ రీ`రిలీజ్‌ అవుతుందంటే అంతా నవ్వారు. మళ్లీ చూసిన సీరియల్‌ ఎవరు చూస్తారని విమర్శించారు. అయితే రీ`రిలీజ్‌ తర్వాత అందరి నోళ్లు మూయించింది ఆ సీరియల్‌.

దీంతో ఆ ఏడాది మార్చి 28 నుంచి పున ప్రసారం చేసారు. ఏప్రిల్‌ 16న ఈ సీరియల్‌ ని ఏకంగా 7.7 కోట్ల మంది వీక్షించడం ప్రపంచ రికార్డు.