Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అవతార్‌ సిరీస్‌ వాయిదా

అవతార్‌  తదుపరి సీక్వెల్స్‌ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు  వాల్ట్‌ డిస్నీ గురువారం ఒక ప్రకటన చేసింది. జేమ్స్‌ కెమరూన్‌ దర్శకత్వంలో అవతార్‌ సిరీస్‌కు చెందిన రెండు భాగాలు రిలీజై,  మరో మూడు భాగాలను రిలీజ్‌ చేయాల్సి ఉంది. మూడు, నాలుగు, అయిదో చిత్రాల రిలీజ్‌ తేదీని వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి….వెంకటేష్‌, తరుణ్‌ భాస్కర్‌ సినిమా కోసం ఎదురు చూపు

అవతార్‌ మిగితా మూడు సీక్వెల్స్‌ రిలీజ్‌ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న అంశంపై ప్రొడ్యూసర్‌ జాన్‌ లాండూ ట్విట్టర్‌లో వివరించారు.

మూడు, నాలుగు, అయిదో సీక్వెల్‌ మేకింగ్‌ కోసం నిర్మాతలుకు మరింత సమయం కావాల్సి వస్తోందని,  వాస్తవానికి డిసెంబర్‌ 2024లో అవతార్‌ 3ని రిలీజ్‌ చేయాలనుకున్నాం కానీ డిసెంబర్‌ 2025కు రీషెడ్యూల్‌ చేశామని తెలిపారు. ఇక అవతార్‌ 4ను డిసెంబర్‌ 2029లో రిలీజ్‌ చేయాల్సి ఉండగా,  అవతార్‌ 5ని డిసెంబర్‌ 2031లో రిలీజ్‌ చేస్తున్నారు.