Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నైరుతి కోసం అన్నదాతల ఎదురుచూపు

రైతన్నన్నను కుంగదీస్తున్న వర్షాభావం
తొలకరి ఆలస్యంతో రైతుల్లో ఆందోళన
వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తొలకరి రాక ఆలస్యం కావడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు సిద్దంగా ఉన్నారు.

ఇప్పటికే నైరుతి ఆలస్యంగా వచ్చింది. దీంతో సాగు భూములకు నీరు లేక నెర్రెలు బారుతున్నాయి. తొలకరి వర్షాలతో విత్తనాలు మొలకెత్తాల్సిన సమయమిది. వర్షాలు లేకపోవడం వల్ల మొలిచిన మొక్కలు ఎండుతుండగా,  సాగు భూములు నెర్రులు పడుతున్నాయి.

ఇది కూడా చదవండి…బిజెపిని వదిలి కాంగ్రెస్‌ వ్యతిరేక పల్లవి అందుకున్న కేసిఆర్

మృగశిర కార్తె ప్రారంభంలోనే వర్షాలు కురియడం ఆనవాయితీ. అప్పుడే విత్తనాలు వేస్తారు. ఓ వైపు వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నా వినలేదు. దుక్కులు దున్ని చాలా మంది రైతులు విత్తనాలు నాటుకునేందుకు సమాయత్తం అవుతున్నా తరుణంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆందోళనతో చూస్తున్నారు.

ఇక మొలచిన మొక్కలను బతికించుకొనేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వర్షాధారంపైనే ఆధారపడిన రైతులు అష్టకష్టాలు పడుతన్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే అన్నదాతలకు కష్టాలు వెంటాడుతుండటంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలాచోట్ల ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట అయిన పత్తి పంటనే సాగు చేస్తారు. వర్షాకాలం ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో ఎప్పుడు పడతాయోనని వాపోతున్నారు.