Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వైద్య రంగానికి బడ్జెట్లో 12,300 కోట్లు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్

వైద్య రంగానికి బడ్జెట్లో 12,300 కోట్లు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి దవాఖాన 100 పడకల హాస్పిటల్గా మార్చిన ఘనత ఎమ్మెల్యే.

తుంగతుర్తి జూన్ 14 నిజం చెబుతాం న్యూస్

తెలంగాణలో వైద్య రంగానికి బడ్జెట్లో 12,300 కోట్లు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆరోగ్య సిబ్బందికి డ్రెస్ చీరలు పంపిణీ చేశారు.

Also read: ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడమే కష్టం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి లోని 30 పడకల దవాఖాను 45 కోట్ల నిధులతో రానున్న రోజుల్లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రి గా రూపుదిద్దుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణలో నూతనంగా 20 మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి కొనియాడారు. రానున్న రోజుల్లో హైదరాబాదులో అత్యాదనికంగా ఆధునిక హంగులతో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టనున్నట్లు తెలిపారు సమాజంలో ఆశ కార్యకర్తలు చేస్తున్న సేవలు మరువలేనని అన్నారు. తక్కువ జీతముతో ఎక్కువ కష్టపడే వాళ్ళుగా గుర్తింపు పొందాలని అన్నారు. ఆశా కార్యకర్తలకు జీతం పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి అని అన్నారు. గ్రామాల్లోని ఆశ కార్యకర్తల నుండి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేసిన సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. కరోనా కష్ట కాలంలో గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలు జీవితాంతం మర్చిపోలేరని పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతానని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ రజాక్, డిఆర్డిఏ పి డి కిరణ్ కుమార్ డి ఐ ఓ పెండం వెంకటరమణ, తాసిల్దార్ రాంప్రసాద్, డాక్టర్ నాగు నాయక్ డాక్టర్ మమత, స్పందన, సముద్రాల సూరి, స్థానిక ఎంపీపీ కవితా రాములు గౌడ్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి చెరుకు పరమేశ్ తడకమల రవికుమార్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు