Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడమే కష్టం

త్వరలోనే టీమ్‌ఇండియా ఛాంపియన్‌షిప్‌ గెలుస్తుందని ఆశిస్తున్నా. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, షమి, సిరాజ్‌ ఇతర ఆటగాళ్లతో కూడిన బృందం ఛాంపియన్‌షిప్‌లు గెలవగలదు. ఫియర్‌ లెస్‌ క్రికెట్‌ ఆడాలని వారికి చెబుతున్నాం. మైదానంలో తమను తాము ఎక్స్‌ప్రెస్‌ చేసుకోవడం ముఖ్యం’ అని గంగూలీ తెలిపాడు.

ఇది కూడా చదవండి…ఆస్టేల్రియా పై బాజ్‌బాల్‌ తరహా గేమ్‌ ఆడతాం…బెన్ స్టోక్స్

’రెండేళ్ల క్రితం టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడింది. కానీ ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సెవిూస్‌ చేరుకుంది.  నాకు రోహిత్‌పై చాలా నమ్మకం ఉంది. అతడు, ఎంఎస్‌ ధోనీ ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచారు.

ఐపీఎల్‌ గెలవడం అంత సులభమేవిూ కాదు. ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడమే కష్టం. ఎందుకంటే ఇందులో 14 మ్యాచులు ఆడాక ప్లేఆఫ్‌కు చేరుకుంటారు.

అదే వరల్డ్‌ కప్‌లో 4`5 మ్యాచులాడితే సెవిూస్‌ చేరొచ్చు. ఐపీఎల్‌లో ట్రోఫీ గెలవాలంటే 17 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది’ అని గంగూలీ చెప్పాడు.