Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జనసేన వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ఇదే

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం , జూన్ 13,( నిజం చెపుతాం ) బ్యూరో:
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన వారాహి విజయ యాత్రకు బుధవారం శ్రీకారం చుట్టనున్నా రు. ఆయన 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు అన్నవరం చేరుకుంటారు.

14వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి అడుగు పెడతారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను సాయంత్రం 5 గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు. వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం ఇవ్వబోయే తొలి గ్రామం కత్తిపూడి కానుంది.

కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. 16వ తేదీ సాయంత్రం 9 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం పర్యటన అనంతరం 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు పిఠాపురం పట్టణంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. అది అయిన తర్వాత రాత్రి 9 గంటలకు కాకినాడ చేరుకుంటారు. కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ పర్యటించిన తర్వాత 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు జనసేన అధినేత కాకినాడ రూరల్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు.

ఇది కూడా చదవండి…విద్యాసంస్థల వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలి

అనంతరం 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరం చేరుకుంటారు. ముమ్మిడివరం పర్యటన అనంతరం 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరం బహిరంగ సభను పవన్ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 9 గంటలకు అమలాపురం చేరుకుంటారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు అమలాపురం బహిరంగ సభ జరుగుతుంది. మళ్లీ 22వ తేదీ 5 గంటలకు రాజోలు వయా పి. గన్నవరం బహిరంగ సభ జరుగును.

అనంతరం 23వ తేదీ 3 గంటలకు నరసాపురం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు నరసాపురం బహిరంగ సభ జరుగును. జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించే వారాహి విజయ యాత్ర 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భీమవరం చేరుతుంది. ప్రతి నియోజకవర్గం లోను 2రోజులు గడిపి వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

యాత్ర దిగ్విజయానికి వివిధ కమిటీలు:

14వ తేదీ నుంచి మొదలయ్యే యాత్రను దిగ్విజయం చేసేందుకు వివిధ కమిటీలను నియమించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో పలు దఫాలు చర్చించి దిశానిర్దేశం చేశారు. ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నాయకులు, శ్రేణులు, వీర మహిళలు, ప్రజలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగేలా ఈ కమిటీలు పని చేస్తాయి. వారాహి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కని
ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెడికల్ టీం కూడా వారాహి విజయ యాత్రతో పాటు అనుసరిస్తుంది.