Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహిళల పై వేధింపులు నివారించేందుకే షీ టీమ్స్

మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కెసిఆర్ ది

దుబ్బాక 13 జూన్ 2023 నిజం చెబుతాం

తొమ్మిదేండ్ల కిందట తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉన్నది. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల మంచినీటి గోస తీర్చలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి సీఎం కేసీఆర్ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు అందించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు పూర్తయి పడేండ్లలో అడుగు పెట్టిన వేళ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీర్ణం అయితలేదని, ఫెయిల్యూర్ అంటూ నోటికొచ్చినట్లుగా పిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.


మూడు రోజుల్లో రూ.6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. ఇప్పటి దాకా రూ.6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతులకు అందించాం. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి పక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
– *రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ

– సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి నాయకత్వంలో ఇవాళ మండుటెండలలో సైతం ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయి.
– దేశంలోని 13 రాష్ట్రాలలో బీడీలు మహిళా కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వట్లేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో బీడీలు చేసే మహిళా కార్మికులకు రూ.2వేల చొప్పున ఇస్తున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి…పరిశ్రమలలో ప్రమాదాలు…. కార్మికుల ఘోష
– గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్ధిపేట జిల్లాలో 1.18 లక్షల మందికి పింఛన్లు ఉంటే, ఇవాళ 2 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడి.
– డబుల్ ఇంజన్ సర్కారు బీజేపీ పాలిత రాష్టాలలో రూ.600 ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2 వేలు ఇస్తున్నాం.
– డబుల్ ఇంజన్ సర్కారు అస్సాం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కరెంటు లేదని ఫ్యాన్లు బంద్ చేయాలని ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నదని, ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో పవర్ హాలీడే ప్రకటించిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
– తెలంగాణ రాష్ట్రం పుట్టిన రోజు సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోవడం లేదు.
– గతంలో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు.?
– రోహిణి కార్తె మండుటెండలలో ఇంటింటికీ తాగునీరు వచ్చిందంటే సీఎం కేసీఆర్ కృషి కారణం.
– మహారాష్ట్ర షోలాపూర్ 8 రోజులకు, నాందేడ్ 4 రోజులకు ఒకసారి నల్లా వస్తే తెలంగాణలో నిత్యం నల్లానీరు వస్తున్నది.
– గతంలో 200 ఫెన్షన్ ఉంటే ఇవాళ 2 వేల ఆసరా ఫించన్లు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నది.
– తెలంగాణలో 12 లక్షల మంది ఆడ పిల్లల పెళ్ళికి సాయం చేశాం.
– పీఏం సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇచ్చేది 12 వేలు రెండేళ్ల తర్వాత ఇస్తారని మంత్రి హరీశ్ విమర్శ.
– తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేసుకున్నాం.
– 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగితే 30 శాతం ప్రయివేటులో జరుగుతున్నాయి.
– రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభం. గర్భిణీలకు 4వ,7వ నెలలో ఈ న్యూట్రిషన్ కిట్లు అందిస్తాం.
– గర్భిణీకి రక్త హీనత తగ్గించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం.
– ఇప్పటికే ఆరోగ్య మహిళ అనే కొత్త పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
– మహిళలకు పెద్ద జబ్బుల నుండి తప్పించేందుకు ఈ ఆరోగ్య మహిళ పథకం ఉపయోగపడుతుంది
– ఆరోగ్య మహిళ పథకం ద్వారా మహిళలకు స్కానింగ్ లు అవసరముంటే సిద్దిపేటలో ఉచితంగా చేయిస్తాం2.
– మహిళల పై వేధింపులు నివారించేందుకు షీ టీమ్స్ ఏర్పాటు చేసాం
– కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేకాట క్లబ్బులను ఉక్కుపాదంతో నలిచారు.
– దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీలకు 5, 6 వేలకు ఎక్కువ లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 13, 500/- అందిస్తున్నాం.
– ఎండాకాలంలో కూడవెల్లి వాగు దూకుతుందంటే సీఎం కేసీఆర్ చలువే.
– 13 లక్షల నుంచి 62 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తున్నామంటే మన కేసీఆర్ ఘనత కాదా? పోయిన యాసంగిలో 47 మెట్రిక్ టన్నులు.
– ఇప్పటిదాక 6 వేల 37 కోట్లు రూపాయలు ఇచ్చాం. ఇంకో 6వేల కోట్లు 3, 4 రోజుల్లో ఇస్తాం.
– అక్కచెల్లెల తోడు, నీడకు కృషి చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం.
– పని చేసే వాళ్లను, పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి. ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం. మంచిని మంచి చెడును చెడు అనండని ప్రజలకు మంత్రి హరీశ్ విజ్ఞప్తి.
– నిజాన్ని ప్రచారంలో పెట్టక పోతే అబద్ధం రాజ్యమేలుతుందని డాక్టర్. బీ.ఆర్ అంబేద్కర్ చెప్పిన మాట.
– ఒకప్పుడు చెరువులో నీరు లేక చేపలు మృతి చెందితే. ఇవాళ చేపలు పట్టడానికి చెరువులో నుంచి నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సీఎం కేసీఆర్ ఘనత.
– ఇతర రాష్ట్రాల నుంచి నాట్లేసేందుకు మగ కూలీలు వస్తున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఎంతుందో ఆలోచించాలని దుబ్బాక ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
– మహిళలకు రిజర్వేషన్ ద్వారా అన్నింటా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ దే.
– రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేయడం మన అదృష్టం.
– సంక్రాంతి ముందు గంగిరెద్దుల మాదిరి ఎన్నికల ముందు ఎంతో మంది వస్తారు. వారిని నమ్మొద్దు.
– మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేసుకుంటాం.
– కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను పిచ్చోల్ల చేతికి అప్పగించవద్దు.
– దుబ్బాకకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా మంత్రి హరీష్ రావు సహకారంతో నిధులు మంజూరు చేసుకుంటున్నాం.