డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు మ్యాచ్‌ల సిరీస్ అయితే బాగుండు
వచ్చే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడాలన్న రోహిత్ శర్మ అన్నారు.
ఆదివారం ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల ఛేదనలో 234 పరుగులకే టీం ఇండియా ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్టేల్రియాపై భారత్ 209 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇది కూడా చదవండి….గీతా గోవిందం డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా
మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ విూడియాతో మాట్లాడుతూ తాను డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాలనుకుంటున్నానని చెప్పారు. తాము చాలా కష్టపడ్డామని, బాగా పోరాడామని, కానీ తాము కేవలం 1 గేమ్ మాత్రమే ఆడినట్లు చెప్పారు.
తదుపరి ఫైనల్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఉంటుందని తాను భావిస్తున్నానని రోహిత్ శర్మ అన్నాడు.