Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గీతా గోవిందం డైరెక్టర్‌ తో విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన లైగర్‌ ప్లాప్‌ అసలు ఊహించని  విజయ్‌ దేవరకొండ కొద్దిపాటి గ్యాప్‌తో ఖుషి సెట్స్‌ విూదకు తీసుకెళ్లాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమా విూద హోప్స్‌ పెట్టుకున్నాడు విజయ్‌.

ఇక ఖుషి తర్వాత విజయ్‌ రెండు సినిమాలు కమిట్‌ అయ్యాడు. అందులో గీతా గోవిందం డైరెక్టర్‌ పరుశురాం తో ఒక సినిమా ఉంది. విజయ్‌ తో చేస్తున్న సినిమా లో కూడా హీరోయిన్‌ రోల్‌ చాలా ఇంపార్టెంట్‌ అని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి….సంక్రాంతికి సినిమాల పండగే

విజయ్‌ పరశురామ్‌ కాంబినేషన్‌ సినిమా లో సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ని హీరోయిన్‌ గా ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పరశురాం మృణాల్‌ తో కథా చర్చలు జరిపారట. ఆమె దాదాపు సినిమా కు ఓకే చెప్పినట్టే అని అంటున్నారు. సో సీతామహాలక్ష్మితో రౌడీ హీరో రొమాన్స్‌ కి రెడీ అని చెప్పొచ్చు.

దిల్‌ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా భారీ బ్జడెట్‌ తో వస్తుందని తెలుస్తుంది. పరశురాం సినిమా తో పాటు గా విజయ్‌ జెర్సీ ఫేమ్‌ గౌతం తిన్ననూరి తో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా డీటైల్స్‌ త్వరలో బయటకు వస్తాయి. ప్రస్తుతానికి అయితే పరశురామ్‌ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌ గా అన్నది లేటెస్ట్‌ అప్డేట్‌. ఇక ఆ సినిమా లో మిగతా కాస్ట్‌ అండ్‌ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.