Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సంక్రాంతికి సినిమాల పండగే

ప్రభాస్‌ ’ప్రాజెక్టు ఐ’,  మహేశ్‌ బాబు ’గుంటూరు కారం’,  రామ్‌ చరణ్‌ ’గేమ్‌ చేంజర్‌’ మూవీ లతో పాటు పవన్‌ కల్యాణ్‌ నటించే ఓ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.  మాస్‌ మహారాజా రవితేజ  నటిస్తోన్న ’ఈగల్‌’ మూవీని కూడా పొంగల్‌ రేసు లోనే నిలుపుతున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది.

మహేశ్‌ బాబు ’గుంటూరు కారం’ మూవీ కూడా సజావుగా షూటింగ్‌ జరుపుకోవట్లేదు. దీంతో ఇది కూడా వచ్చే ఏడాది వేసవి కి వాయిదా పడే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది.  ’గేమ్‌ చేంజర్‌’ సంక్రాంతికి రాకపోతే ’ఇండియన్‌ 2’ సినిమా ను రిలీజ్‌ చేయాల ని శంకర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి….రామయ్య అడవులకు వెళ్లినప్పటి నుంచి జరిగే కథే ఆదిపురుష్‌

మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఇంకా ఏడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో రిలీజ్‌ కాబోయే చిత్రాలు మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.