Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రామయ్య అడవులకు వెళ్లినప్పటి నుంచి జరిగే కథే ఆదిపురుష్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ’ఆదిపురుష్‌ .  తొలిసారిగా ప్రభాస్‌ ఓ పౌరాణిక చిత్రాన్ని చేశారు. అది కూడా రాముని కథ కావడంతో దేశం మొత్తం ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎదురు చూస్తోంది. ఈ దృశ్యకావ్యాన్ని 16న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు.

మూవీ విడుదల దగ్గరపడుతుండటంతో సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.   రామయ్య అడవులకు వెళ్లినప్పటి నుంచి కథ మొదలౌతుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి…తెలంగాణలో పొత్తులతో లేకుంటే ఒంటరిగానే పోటీ

వాలి, సుగ్రీవుల మధ్య పోరాటం, వారి మధ్య జరిగే సంభాషణలు మూవీకి హైలెట్‌ అవుతాయని అంటున్నారు. ఇక ఆంజనేయుడు లంకా దహనం, రామ, రావణ యుద్ధం చూడటానికి రెండు కళ్లు సరిపోవట.  త్రీడీ లో చూసిన వారికి ఆ సీతారాముల కథను దగ్గర నుంచి చూసిన భావన కలుగుతుందని చెబుతున్నారు.

రావణాసురుడిగా సైఫ్‌ తప్ప మరో వ్యక్తి సూట్‌ అవ్వడేమో అనే భావన సినిమా చూసినవారందరికీ కచ్చితంగా కదులుతుందని చెబుతున్నారు. సైఫ్‌ రావణ పాత్ర లో చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.