Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలో పొత్తులతో లేకుంటే ఒంటరిగానే పోటీ

డిసెంబర్‌లో తెలంగాణలో జరగనున్నాయని… అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు ఉంటాయని,  రెండు తెలుగు రాష్టాల్ల్రో ఒకేసారి డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అందుకు తగ్గట్టుగానే సన్నద్దంగా ఉండాలని పార్టీలీడర్లకు పవన్ కళ్యాణ్  సూచించారు.
తెలంగాణలో కావాలనుకుంటే పొత్తులతో వెళ్తామని లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంతలో జనసేన నాయకులు ప్రజల్లో ఉండి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఏ సిద్దాంతం ప్రకారం తెలంగాణ వచ్చిందో అది ఎంత వరకు నెరవేరింది… యువత ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి….నేటినుంచి జనసేనాని వారాహి యాత్ర

తెలంగాణలో పలు ప్రాంతాల్లో యాత్ర ఉంటుందని చెప్పగానే నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓ ప్రెస్‌విూట్‌లో మాట్లాడుతూ… డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే తాను జూన్‌ నుంచి ప్రజల్లో ఉంటానని యాత్ర చేపడతానంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంగా 26 నియోజక వర్గాలకు బాధ్యులను కూడా నియమించారు. ప్రజల్లో ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చేల కష్టపడాలని సూచించారు.