Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేటినుంచి జనసేనాని వారాహి యాత్ర

అన్నవరంలో పూజలతో యాత్రకు శ్రీకారం
భారీగా ఏర్పట్లతో పాటు షెడ్యూల్‌ ఖరారు
డిజజెంబర్‌లోనే ఉభయ తెలుగు రాష్టాల్ర ఎన్నికలు
పార్టీ శ్రేణులు సన్నద్దంగా ఉండాలన్న జనసేనాని
గుంటూరు,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్టాల్ల్రో ఎన్నికలపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. వచ్చే డిసెంబర్‌లో ఉభయతెలుగు రాష్టాల్ల్రో ఒకేసారి డిసెంబర్‌లో ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. వారాహి యాత్ర తెలంగాణలో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా స్పందించారు. జనసేన అధినేత పవన్‌ కల్యామ్‌ వారాహి యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో పవన్‌ ఓ యాగాన్ని కూడా తలపెట్టారు. అది రెండో రోజు కొనసాగుతోంది. ఇక్కడ యాగం ముగించుకున్న తర్వాత పవన్‌ నేరుగా అన్నవరం చేరుకుంటారు. బుధవారం ఉదయం అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్యత్య్రేక పూజలు చేసి వారాహి యాత్రను ప్రారంభిస్తారు.

సాయంత్రానికి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. యాగ దీక్షలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ను కొందరు తెలంగాణ జనసేన నేతలు వచ్చి కలిశారు. తెలంగాణలో యాత్రపై క్లారిటీ ఇవ్వాలని.. ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశర చేయాలని చెప్పారు. వారితో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి….ఉద్యోగులకు లేని పెన్షన్‌ రాజకీయ నేతలకు ఎందుకు?

డిసెంబర్‌లో తెలంగాణలో జరగనున్నాయని… అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు ఉంటాయన్నారు. రెండు తెలుగు రాష్టాల్ల్రో ఒకేసారి డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అందుకు తగ్గట్టుగానే సన్నద్దంగా ఉండాలని పార్టీలీడర్లకు సూచించారు.
తెలంగాణలో కావాలనుకుంటే పొత్తులతో వెళ్తామని లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంతలో జనసేన నాయకులు ప్రజల్లో ఉండి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఏ సిద్దాంతం ప్రకారం తెలంగాణ వచ్చిందో అది ఎంత వరకు నెరవేరింది… యువత ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు.

ప్రజాసమస్యలపై పోరాటం చేసే క్రమంలో ఇంటిగ్రిటీని పోగొట్టుకోవద్దని జనసేన నేతలకు పవన్‌ సూచించారు. ఒంటరిగా పోటీ చేసిన తక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని వాటిపైనే ఫోకస్డ్‌గా పని చేస్తామన్నారు. నేతలు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలన్నారు. వారాహి ఎక్కడ మొదలైందో అక్కడే ముగించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిపారు.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో యాత్ర ఉంటుందని చెప్పగానే నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓ ప్రెస్‌విూట్‌లో మాట్లాడుతూ… డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే తాను జూన్‌ నుంచి ప్రజల్లో ఉంటానని యాత్ర చేపడతానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన యాత్ర చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంగా 26 నియోజక వర్గాలకు బాధ్యులను కూడా నియమించారు. ప్రజల్లో ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చేల కష్టపడాలని సూచించారు.

ఇదిలావుంటే జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపడుతున్న యాగంలో పాల్గొన్న దేవీ దేవతలను దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శించుకున్నారు. వారాహి వాహానాన్ని హరీష్‌ శంకర్‌ పరిశీలించారు.

రాజకీయాల్లో బిజీగా ఉంటూ షూటింగులు చేయాలనే అంశంపై పవన్‌ ` దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. ఇకపై ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న క్రమంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని లొకేషన్లను దర్శక నిర్మాతలు చూసి వచ్చారు.

ఈ సందర్భంగా హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ.. వారాహి యాత్ర చేపడుతున్న పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి తొలిసారి వచ్చానని.. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇకపై మంగళగిరిలో ఉండబోతున్నారన్నారు.

పవన్‌ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్  చేసుకుంటున్నామన్నారు. ఏపీ, బెజవాడ, మంగళగిరి ప్రాంతాల్లో షూటింగులు తీసే అంశంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడామన్నారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయని హరీష్‌ శంకర్‌ తెలిపారు.