Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ మాలోత్ కవిత జైలుకు వెళ్లడం ఖాయం….

ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ డాక్టర్ బెళ్లయ్య నాయక్

మహబూబాబాద్ బ్యూరో జూన్ 13 నిజం న్యూస్

మానుకోట పట్టణం లో స్థానిక బెల్లయ్య నాయక్ క్యాంప్ కార్యాలయంలో లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బెల్లయ నాయక్ 150 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది – మానుకోట భూ కబ్జాదారుల లిస్ట్ లో మొదట ఎమ్మెల్యే శంకర్ నాయక్,ఎంపీ కవిత జైలుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపడం ఖాయం….

ప్రభుత్వ భూములను, ప్రవేట్ గా మార్చి పట్టాలు జారీ చేసిన రెవెన్యూ అధికారులు కూడా వెళ్ళక తప్పదు ….

ప్రభుత్వ భూములను కబ్జా పేట్టిన జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ప్లాట్లు అమ్ముకుంటున్న పరిస్థితి మానుకోట పట్టణం లో వుందని – స్థానిక మునిస్పల్ కార్పొరేటర్లు కలెక్టర్ కి పిర్యాదు చేయడం జరిగింది….

ఆ ప్రభుత్వ భూమి నీ కాపాడాలని జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.మానుకోట పట్టణం లో పేదలు వేసుకుంటున్న గుడిసెలను,ఎమ్మెల్యే,ఎంపీల బలంతోనే అధికారులు తొలగిస్తున్నారు..

ఆ గుడిస వాసులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది అదే విధంగా రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం లో వేసుకున్న చోటే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు సహాయం అందిస్తామని అన్నారు.ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలు పై స్పందించే అధికారులు – రాజకీయ నాయకులు కబ్జా చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి అన్నారు….

ఈ మీడియా సమావేశం లో ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ నాయక్ ,మాజీ పట్టణ అధ్యక్షులు ముల్లంగి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జిన్నరెడ్డి వెంకటేశ్వర్లు ,కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ , సురేష్ నాయక్ తదితరులు ఉన్నారు.