Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌

వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్‌కు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన ఆ మేరకు గెజిట్‌ ప్రచురితమైంది.

ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌

ఫస్టియర్‌ ఫెయిలైతే సప్లిమెంటరీనే ఫైనల్‌

అందులోనూ ఫెయిలైతే మళ్లీ ఫస్టియర్‌

ఫస్టియర్‌కు నాలుగు చాన్సులే

నీట్‌ మాదిరిగా ఎంబీబీఎస్‌

అడ్మిషన్లకు కామన్‌ కౌన్సెలింగ్‌

ఆగస్టులోగా ప్రవేశాలు ముగించాలి

ఆ గడువు దాటితే అవకాశం ఉండదు

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మార్గదర్శకాలు

2028 నుంచి పీజీకి నీట్‌ ఉండదు!

మహబూబాబాద్ బ్యూరో జూన్13 నిజం న్యూస్

వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్‌కు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన ఆ మేరకు గెజిట్‌ ప్రచురితమైంది. దీన్ని బట్టి ఇకపై వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ పూర్తిచేయడానికి తొమ్మిదేళ్ల గడువు మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ రెగ్యులేషన్స్‌-2021 ప్రకారం వైద్య విద్యార్థి తన ఇంటర్న్‌షి్‌పను పూర్తి చేసుకున్నాకే ఎంబీబీఎస్‌ పట్టా చేతికి అందుతుంది. ఇక వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్‌ మాదిరిగానే.. దేశవ్యాప్తంగా అడ్మిషన్లకు కామన్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు గెజిట్‌ — గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌ 2023 స్పష్టం చేస్తోంది. ఈ నియంత్రణ ప్రస్తుత విద్యా సంవత్సరం(2023-24) నుంచే అమల్లోకి వస్తుంది.

Also read: వసతిగృహాల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

తొమ్మిదేళ్లలోనే క్లియరవ్వాలి

తాజా గెజిట్‌ ప్రకారం.. ఇకపై ఎంబీబీఎస్‌ విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకున్న నాటి నుంచి తొమ్మిదేళ్లలో కోర్సును పూర్తిచేయాలి. ప్రస్తుతం ఎంబీబీఎ్‌సలో మొదటి సంవత్సరంలో ఎవరైనా ఫెయిల్‌ అయితే.. రెండో సంవత్సరంలో కొనసాగుతూ.. సప్లిమెంటరీ రాస్తారు. ఇకపై ఆ అవకాశం ఉండదు. సెకండియర్‌లో కూర్చోవాలంటే.. సప్లిమెంటరీలో అన్ని సబ్జెక్టులను క్లియర్‌ చేయాల్సిందే. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా.. మళ్లీ ఫస్టియర్‌లో కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా.. ఫస్టియర్‌ పూర్తి చేయడానికి 4 అవకాశాలే ఉంటాయి.

ఉమ్మడి కౌన్సెలింగ్‌

రాష్ట్రాల పరిధిలో ఎంసెట్‌ ద్వారా జరిగే వైద్య విద్య ప్రవేశాలను నీట్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అభ్యర్థుల ఆప్షన్లను రాష్ట్రాల వైద్య మండళ్లు సీట్లను కేటాయించేవి. తాజా గెజిట్‌ ప్రకారం.. కామన్‌ కౌన్సెలింగ్‌ పేరుతో ఆ ప్రక్రియను కూడా కేంద్రం పరిధిలోకి వెళ్తుంది.

ఆగస్టు 30 దాటితే.. నో అడ్మిషన్‌

వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియను ఏటా ఆగస్టులోగా పూర్తిచేయాలని తాజా గెజిట్‌ పేర్కొంటోంది. ఆగస్టు 30 దాటితే.. అడ్మిషన్‌ ప్రక్రియకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని వెల్లడిస్తోంది. గడువు ముగిశాక ఎంబీబీఎ్‌సలో చేరేవారిని డిశ్చార్జ్‌ చేస్తామని ఎంఎన్‌సీ హెచ్చరించింది. అలాంటి వారి విద్యార్హతను గుర్తించబోమని స్పష్టం చేసింది.

పీజీకి నీట్‌ ఉండదు

ఈ ఏడాది ఆగస్టులో వైద్యవిద్యలో ప్రవేశించిన విద్యార్థులకు.. 2027 డిసెంబరులో ప్రత్యేక పరీక్ష ఉంటుందని ఎన్‌ఎంసీ తెలిపింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే దేశంలో వైద్యవృత్తిని ప్రాక్టిస్‌ చేసుకునే అర్హత లభిస్తుంది. అందులో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశముంటుంది. అంటే.. 2028 నుంచి పీజీ కోసం నీట్‌ పరీక్ష ఉండదు.