జిల్లాల్లో మారనున్న …సమీకరణాలు?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో ఒక మంత్రి ఎమ్మెల్యే సీటు, ఎంపీ స్థానంకు పోటీ చేయవలసిందే….
కెసిఆర్ సంబంధిత మంత్రులకు..హుకుం జారీ చేసినట్టు …సమాచారం.
జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఉంటారో.. పోతారో …భయం… భయం
హైదరాబాద్ జూన్ 13 నిజం చెబుతాం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దఫా ఎలక్షన్ లో కొంతమంది మంత్రులను, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా గతంలోనే తెలియపరచిన సంగతి విధితమే. దీనితో ఆయా జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా కొంతమంది పనిచేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలోని ఉన్న మంత్రివర్గంలో సగానికి పైగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.
దీనితో ఆయా జిల్లాలలో పనిచేస్తున్న మంత్రులు ఎంపీగా పోటీ చేయడానికి సుముఖంగా లేరని వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈసారి గెలిస్తే కొంత మంది ఎమ్మెల్యేలు, హ్యాట్రిక్ దిశలో పయనిస్తూ, మంత్రి వర్గాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి.
Also read: మంత్రి మహాప్రభో…. జర మానుకోట దవాఖాన చూడవయ్యా!?.
కష్టపడి గెలిచి, ఏదైనా మంత్రి శాఖను పొందాలని లోలోపల ఆశ ఉన్నప్పటికీ… ప్రస్తుత పరిస్థితిలో ఎంపీగా నిలబడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే…, మా పరిస్థితులు ఏంటని, వారిలో వారే మదన పడుతున్నారు. దీనికి తోడు కొన్ని జిల్లాలో నువ్వే ఎంపీగా పోవాలంటే …. నాకెందుకు .. మీరే వెళ్లండి. అని ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ. ఎవ్వరికి వారే… నియోజకవర్గాల్లో జోరుగా.. ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం…
ఏది ఏమైనా ఉద్యమ వీరుడు, తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాలో ఎవ్వరికి ఎంపీ పదవి కట్టబెడతారో… ఎవ్వరికి వస్తుందో…. ఎవరికి ఎమ్మెల్యే సీటు దక్కుతుందో…. పోతుందో… వేచి చూడాల్సిందే సుమ…