Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంత్రి మహాప్రభో…. జర మానుకోట దవాఖాన చూడవయ్యా!?.

___ ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టకుండా ప్రభుత్వం నిషేధించాలి.

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక్క రోగి చని పోయిన విచారణ జరిపి అతని డాక్టర్ పట్టాను రద్దు చేయాలిశిక్షించాలి. ___డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగి చనిపోతే ఎక్స్గ్రేషియా డాక్టర్ తోనే ఇప్పించాలి.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 12, (నిజం న్యూస్):

రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రోగులకు మంచి వైద్యం అందించాలని ఆలోచనతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటలతో సమానమైన మిషనరీలను ఏర్పాటు చేసింది.

ఈ మధ్యకాలంలో మానుకోట జిల్లాలో కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ లో ఎస్సీ ఎస్టీ బీసీల రోగులను నిలువునా దోచుకుంటున్న ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న ప్రైవేటు డాక్టర్లు.
ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు ఉండవలసింది సమయస్ఫూర్తి. వచ్చామా సమయానికి వేలిముద్ర వేసామా మన ఆసుపత్రికి పోయామా! ఇది ప్రస్తుతానికి మన మహబుబూబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్వాకం.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి టైం ప్రతిరోజు రెండు గంటల వరకు పెంచారు. కానీ ఒంటి గంట కె ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు సిబ్బంది మెల్లమెల్లగా అందరూ ఖాళీ అవుతారు. వీళ్లు ఇచ్చిన ఓపి.చిట్టి పట్టుకొని ఉన్న పేషెంట్లు రూములన్ని తిరిగి వస్తారు. ఎంతమంది పేషెంట్లు ఉన్నా కూడా వాళ్లు చేసేది చేస్తూనే ఉంటారు.

ఒంటి గంటకి గర్భిణీ స్త్రీలకు , కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్లకు ,ఇతర సమస్యలతో డాక్టర్ రాసిన స్కానింగ్ చిట్టి పట్టుకొని స్కానింగ్ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తే ఒంటి గంటకి మూసేసి వెళ్ళిపోయారు అని చెబుతారు. ఆ తరువాత ఆ పేషెంట్ ను ప్రైవేటు దావకానలకు స్కానింగ్ తీపించుకు రమ్మని పంపిస్తారు. ఈ విధంగా జిల్లా ఆసుపత్రిలో ఒక ముఠాపన చేస్తుంది.

ఇది కూడా చదవండి….క్రీడాకారులకు పుట్టినిల్లు జయపురం గ్రామం
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న కొందరు ప్రైవేటు సెంటర్లలో కమిషన్లు మాట్లాడుకుని ఇక్కడి నుండి పేషంట్లను అక్కడికి తరలిస్తున్నారు. ఎక్కడ కూడా లేని పరికరాలు మన సర్కారు దవాఖానలో ఉన్నాయి.

స్కానింగ్. సిటీ స్కానింగ్. బ్లెడ్ బాంక్. బ్లెడ్ టెస్టులు. యూరిన్. టెస్టులు. వెంటిలేటర్. ఎమర్జెన్సీ సర్వీసులు . ప్రతి ఒక్క పరికరాలు జిల్లా సర్కారు దావకానలో ఉన్నాయి. సిటీ. స్కనింగ్ కి దవాఖానలో అడ్మిట్ అయిన పేషంట్లను ఓ. పి చిట్టీ రాసి ఇచ్చి ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు పంపుతున్నారు.

అక్కడి డాక్టర్లు. ఒక పక్క ఇక్కడ అడ్మిట్ అయిన పేషేంట్లకు ఇక్కడే అన్నిరకాలుగా వైద్యం అందిస్తున్నాం అని సర్కారు దవాఖాన పెద్దలు చెపుతున్నారు. ఎవరు చెప్పిన మాటలు వినలో తెలియక ఆపదలో ఉన్న పేషేంట్లు చిట్టీల పట్టుకొని ప్రైవేటు సెంటర్లలోకి వెళ్లి టెస్టులు , స్కానింగులు చేయించుకొని వస్తున్నారు .

ఆ స్కానింగ్ తెచ్చిన తర్వాతే మిగతా వైద్యం నడుస్తుంది . ఇక ప్రభుత్వ దవాఖానాలలో పనిచేసే ప్రైవేట్ డాక్టర్లు తమ ఆస్పత్రులలోనే మెడికల్ షాపులు వారి పేరునే పెట్టుకుంటున్నారు. ఈ మందులన్నీ పేషెంట్ కోనగలడా కొనలేడా అని చూడరు. ఎందుకంటే మెడికల్ షాప్ తనదే కాబట్టి, పేషెంట్లకు తన ఇష్టం ఉన్నన్ని ప్రిస్క్రిప్షన్ లో మందులు రాస్తారు.

పేషెంట్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందుల షాపుకు వెళ్ళగానే 200o నుండి 3000 పైచిలుకు అని చెప్తారు. ఇక పేషెంట్ బాధలు ఆ దేవుడి కె తెలుసు. పేషెంట్ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తన రోగం గురించి చెప్పగానే, ముందుగా మూత్ర పరీక్ష కాడి నుంచి మొదలుపెట్టి అన్ని పరీక్షలు రాస్తారు. వీటన్నిటికీ సుమారు ఒక 5000 అవుతాయని పేషెంట్ కు చావు కబురు సల్లగా చెబుతారు.

ఈ విధంగా పేషెంట్ గోర్లు ఊడగొట్టి వసూలు చేస్తున్నారు. వీరికి బీదవారు, ఉన్నవారు అనే తారతమ్య భేదం తెలువదు. వారికి డబ్బు సంపాదించడమే కావాలి. ఇక ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న రోగుల విషయం చూస్తే, ఈమధ్య ఒక గర్భిణీ స్త్రీ ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యానికి గురై మరణించిన విషయం పాఠకులకు తెలిసిందే.

తమకు సంబంధించిన ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి పంపించి మూత్ర పరీక్షల కానించి మొదలుపెడితే సిటీ స్కానింగ్ ల వరకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ లోనే చేయిస్తున్నారు. ఈ రకమైన దోపిడి గురించి ఇవన్నీ సూపర్డెంట్ కి తెలియదు అంటారా? అయితే వారి స్కానింగ్ రిపోర్ట్ లన్ని వారి బెడ్ పక్కనే ఉంటున్నాయి .

సూపర్డెంట్ ఆసుపత్రికి రాట్లేరు అంటారా? మరి ఇవన్నీ తెలిసినా కూడా జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ ఎందుకు వారిని మందలించడం లేదు.? వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. సర్కార్ దావకానలో డాక్టర్లు గా పనిచేస్తూ ప్రైవేటు యాజమాన్యాలతో కమిషన్లు పుచ్చుకుంటున్న డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లా కలెక్టర్ ని ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రి ని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.