Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్రీడాకారులకు పుట్టినిల్లు జయపురం గ్రామం

క్రీడల్లో రాణిస్తున్న జయపురం ఆణిముత్యాలు.

హంగులు లేవు.. ఆర్భాటాలు లేవు..
ఆడాలన్న తపనతప్పా..!

నిరుపేద కుటుంబాల పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని తలచిన రిటైర్డ్ పిఈటి వీరారెడ్డి

సొంతగ్రామానికి మంచి తరాన్ని అందించాలని తలచిన వంగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి.

2015 సంవత్సరంలో మొదలైన శిక్షణ…
క్రమేపి ‘వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు’గా మారిన కటోర దీక్ష.

వెనుదిరిగి చూడని… పల్లెటూరి బుడతలు.

జాతీయ,అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకుంటున్న చిచ్చర పిడుగులు.

మారుమూల పల్లెలో మెరికల్లాంటి విద్యార్థులు

నర్సింహులపేట జూన్ 12 (నిజంన్యూస్ ):

కనీస బస్సు రవాణా సౌకర్యం కూడా లేని అతి చిన్న పల్లెటూరులో నిరుపేద విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చి జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు పి వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహం అన్నారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో శ్రీ రామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి సహకారంతో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు నెలకుర్తి వీరారెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు క్రీడల యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వారిని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి శిక్షణ ఇవ్వడం వారిని జాతీయ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా కృషి చేస్తూ భవిష్యత్ తరంలో క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా చేయడం అభినందనీయమని ప్రతి ఏటా ఇలాంటి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ విద్యార్థులను మళ్ళీ మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందుల యాకన్న ,ప్రధానోపాధ్యాయురాలు రాగిణి, ఎస్ ఎం సీ చైర్మన్ రావుల శ్రీనివాస్, రిటైర్డ్ టీచర్లు నర్సింహారెడ్డి, రఘోత్తం రెడ్డి, టీచర్ ప్రభాకర్ రెడ్డి, శ్రీరాం చిట్ ఫైనాన్స్ రిజనల్ మేనేజర్ యండీ ఇమామ్ పాషా, ప్రముఖ అథిది నెలకుర్తి కృష్ణ రెడ్డి, గ్రామస్థులు మల్లారెడ్డి, చెన్నారెడ్డి అనిల్ , రాచమల్ల విజయ్, క్రీడాభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
2015 సంవత్సరంలో మొదలైన శిక్షణ…
క్రమేపి ‘వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు’గా మారిన కటోర దీక్ష.

నర్సింహులపేట మండలం లోని జయపురం గ్రామంలో 2015 నుండి ప్రతి ఏటా వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం నెలరోజుల పాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగాల ప్రవీణ్ కుమార్,గ్రామస్థుల ఆర్థిక సహకారంతో మారుమూల గ్రామం లోని విద్యార్థినీలను వాలీబాల్, క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారులు గా తీర్చిదిద్దుటకు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కోచ్ నెలకుర్తి వీరారెడ్డి కృషిచేస్తున్నారు.దీనికి గాను జయపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులు వంగాల సుదర్శన్ రెడ్డి,వంగాల రాంచంద్రారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగల ప్రవీణ్ కుమార్ సహకారం తో
వాలీబాల్ క్యాంపును నెలరోజుల పాటు నిర్వహించారు.
మొదటగా గ్రామంలో ని విద్యార్థులు వేసవిలో చెడు అలవాట్లవైపు ఆకర్షితులు కాకుండా వారిని ఆరోగ్య వంతంగా తీర్చిదిద్దడానికి మొదలైన ప్రయాణం ఈ ఎనిమిదేళ్ళలో ఏన్నో ,జాతీయ ,రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనెలా చేసింది.నేటికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతో శ్రమించి ఇస్తున్న శిక్షణ సమ్మర్ వాలీబాల్ శిక్షణ శిభిరంగా పరిణవించింది.

హంగులు లేవు.. ఆర్భాటాలు లేవు..ఆడలన్న తపనతప్పా..!

అతిచిన్న గ్రామమైన జయపురం లో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకున్నా. ఉన్నతమైన సౌకర్యాలు కల్పించకున్న గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అతి చిన్న మైదానంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు నెలకుర్తి వీరారెడ్డి కృషితో 2015సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అండర్ 14 విద్యార్థులకు నెల రోజుల పాటు సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు,

ఈ శిక్షణ శిబిరం లో సుమారు 50 మంది విద్యార్థులు క్రీడా మెళుకువలు పొందుతున్నారు.ఈ శిక్షణ 2015 సంవత్సరం గ్రామ స్థాయిలో మొదలు పెట్టిన క్రీడల్లో ఈ గ్రామ విద్యార్థులు మొన్న జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం గెలుపొందటంతో పాటు ఇప్పటి వరకు తెలంగాణ జుట్టు తరుఫున ఎనిమిది సార్లు జాతీయ స్థాయి లో ఆడి ప్రతిభా కనబరిచారు.

ఇది కూడా చదవండి…పోలీస్ ఉద్యోగార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్

చెందు లావణ్య 2018 లో మంచిర్యాల లో నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ షిప్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.2019 లో నిజామాబాద్ లో ఎస్ జీ ఎఫ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ను, 2019 లో ఖమ్మం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడలో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు.

అండర్ 20 ఏషియన్ చాంపియన్షిప్ కొరకు భువనేశ్వర్ క్యాంపు కు సెలెక్టై శిక్షణ తిసుకుంటుంది,కజకిస్తాన్ లో జరిగిన ఏషియన్ శాంపియన్ షిప్ లో కూడా ప్రతిభ కనభరిచింది.నెలకుర్తి కృష్ణారెడ్డి- మాధవిల కూతురు అర్జున అవార్డు గ్రహిత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి స్వస్థలం జయపురం గ్రామమే కావడం విశేషం.

నిరుపేద కుటుంబాల పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని తలచిన రిటైర్డ్ పిఈటి వీరారెడ్డి.

సాధారణంగా విశ్రాంత ఉద్యోగులు పదవీవిరమణ అనంతరం గత వ్యాపకాలను వదిలేసి విశ్రాంతి తీసుకుంటారు.. లేదా కుటుంబ వ్యవహారాలు చూసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. కానీ జయపురం గ్రామానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు గ్రామంలోని నిరుపేదలైన విద్యార్థులను చేరదీసి వారిలో క్రమశిక్షణ యువతమైన జీవనాన్ని అలవర్చాలనే సంకల్పంతో క్రీడలను పరిచయం చేస్తూ వస్తున్నారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వంత పనులను వదిలేసి ప్రతిరోజూ విద్యార్థులకు వాలీబాల్ టేబుల్ టెన్నిస్ క్రీడలపై శిక్షణ ఇస్తూనే ఉంటారు.
తద్వారా మెరికల్లాంటి విద్యార్థులను తయారుచేస్తున్నారు..ఆ విశ్రాంత ఉపాధ్యాయుని కృషికి తల్లిదండ్రులు,గ్రామస్తులు అభినందిస్తున్నారు.

సొంతగ్రామానికి ఏదైనా చేయాలనే తపన

మహబూబాబాద్ జిల్లా జయపురం గ్రామానికి చెందిన వంగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా స్థిరపడ్డారు. సొంత గ్రామానికి ఏదైనా చేయాలనే తపనతో గ్రామంలోని విద్యార్థుల ను క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తూ విశ్రాంతి ఉపాధ్యాయుడు ఏర్పాటు చేస్తున్న శిక్షణ శిబిరాల నిర్వహణకు తనవంతుగా సహకరిస్తున్నారు.

నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల క్రీడా సామాగ్రికి క్రీడా వస్తువులకు క్రీడా దుస్తులకు, వివిధ ప్రాంతాలలో పోటీలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.

క్రీడాకారులకు గతంలో ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారులు ఎందరో అతి సామాన్యమైన జీవితాల నుండి అతి చిన్న పల్లెల నుండి ఎదిగిన వారేనని ప్రవీణ్ కుమార్ రెడ్డి నమ్ముతూ మారుమూల గ్రామాలలోని విద్యార్థుల లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేస్తుండటం అభినందనీయమని ఇటు గ్రామస్తులు తమ బాగోగులను పట్టించుకుంటున్న తీరుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.