Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీస్ ఉద్యోగార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 12,( నిజం న్యూస్):
పోలీస్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించి అందులో అర్హులు అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయుట కొరకు రాష్ట్ర పోలీస్ రిక్రూటమెంట్ బోర్డ్ వారు మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి 7034 మంది ఉద్యోగార్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 14వ తేది నుండి 26వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో చేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.

14వ తేది నుండి 26వ తేదీ వరకు 11 రోజుల పని దినములలో ప్రతిరోజూ 600 మంది ఉద్యోగార్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయుటకు జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధం అవుతుంది.

ఇది కూడా చదవండి…అక్రమంగా చెరువు మట్టి తరలింపు

కావున వెరిఫికేషన్ కోసం వచ్చే అభ్యర్థులు తమకు నిర్దేశించిన తేదీలలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 9:00 లకు హాజరు కాగలరని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవారు ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు తమ వద్ద ఉన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్
1,క్యాస్ట్ /కమ్యూనిటీ సర్టిఫికేట్
2. ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికేట్
3. ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్
4.ఆధార్ కార్డు
5.ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్
6. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ , ఎడిటింగ్ ఫామ్,
7. బోనాఫైడ్ సర్టిఫికెట్,
8.లోకల్/ నాన్ లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్
9.నాన్ క్రిమిలయర్ సర్టిఫికేట్
10.ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్
11. ఎం ఎస్ పి సర్టిఫికెట్స్.
12. స్పోర్ట్స్ సర్టిఫికేట్.
13. ఎన్సిసి సర్టిఫికెట్స్, సర్వీస్ సర్టిఫికేట్
14. డ్రైవింగ్ లైసెన్స్
అప్లికేషన్ ఫార్మ్ లో జత పరిచిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తోపాటు వాటి జీరాక్స్ కాపీలు తీసుకొని సకాలములో హాజరు కాగలరని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఉదయం పూట 300 మంది మధ్యాహ్నం 300 మంది మొత్తం రోజుకు 600 మందికి గాను ఏర్పాటు చేసిన 10 కౌంటర్లలో 11 రోజులపాటు తమకు నిర్దేశించిన తేదీలలో అభ్యర్థులకు వెరిఫికేషన్ చేయబడును.
అభ్యర్థులు అందరూ సకాలంలో అన్ని పత్రములతో వచ్చి జిల్లా పోలీస్ సిబ్బందికి సహకరించగలరని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.