Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సమాజంలో కృష్ణవేణి ఫౌండేషన్ చేస్తున్న సేవలు మరువలేనివి

తుంగతుర్తి ఉచిత మెగా హెల్త్ క్యాంపులో పాల్గొన్న ప్రజలు

సూర్యాపేట డిఎస్పి నాగభూషణం, తెంజు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్.

తుంగతుర్తి జూన్ 12 నిజం చెబుతాం..

సమాజంలో కృష్ణవేణి ఫౌండేషన్ ద్వారా ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి పేద ప్రజలకు సేవలు చేయడం అభినందనీయమని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెంజు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్. ఇస్మాయిల్ అన్నారు.

సోమవారం మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలకు బీపీ షుగర్ ఈసీజీ 2d ఎకో డాక్టర్ కిరణ్ కుమార్ అపోలో హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పుట్టి కృష్ణవేణి ఫౌండేషన్ ద్వారా సేవలందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులతో పాటు, పేద ప్రజలకు ఆరోగ్యం పట్ల సేవలందిస్తున్నాడో తెలిపారు.

Also read: భారతీయ సినీ రంగములో నూతన దర్శకుడిగా అడుగు పెడుతున్న వై ఆర్ చౌదరి

రానున్న రోజుల్లో కూడా కృష్ణవేణి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు మరికొన్ని పరీక్షలు నిర్వహించుటకు ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ ఎస్ ఐ డానియల్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఉద్యమ నాయకుడు ఓరుగంటి సత్యనారాయణ, నాగుల్ మీరా, సీనియర్ జర్నలిస్టులు తాళ్లపల్లి సోమన్న ఎండి నజీరుద్దీన్ సూర్య ప్రకాష్ ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్ రామచంద్రు ఎల్లయ్య దస్తగిరి రమేష్ మాజీ తదితరులు పాల్గొన్నారు