Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి తప్పిన ప్రమాదం

జమ్మికుంట, జూన్ 12 (నిజం చెపుతాం)

హుజురాబాద్ పట్టణం లో సోమవారం ఉదయం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న టు కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు వెళ్తున్నారు.

కేశవపట్నం మండలం తాడికల్ గ్రామం లో వాహనానికి సమీపంలోకి బైకు రావడంతో కారు డ్రైవర్ ప్రమాదం తప్పించబోయి చెట్టును ఢీ కొట్టాడు.

Also read: 17 వరకు ఒంటిపూట పాఠశాలలు

పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంలో బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పింది.

అక్కడ నుండి ఎమ్మెల్సీ వేరే కార్ లో హుజురాబాద్ కు బయలుదేరారు. బైక్ పై వెళుతున్న రైతుకు స్వల్ప గాయాలు కావడంతో 108 లో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికి నమస్కారం..

ఈ రోజు ఉదయం నా కారు యాక్సిడెంట్ కి గురైన మాట వాస్తవమే కాని కారులో ఉన్న అందరం సురక్షితంగా ఉన్నాము.

ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలియజేస్తున్నాను.