Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎంపీడీవో లు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎంఎల్ఏ గ్రంథి. శ్రీనివాస్

భీమవరం నిజం న్యూస్

ఎంపీడీఓ లు మండలాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఎల్ఏ గ్రంథి. శ్రీనివాస్ సూచించారు.

బుట్టాయిగూడెం నుంచి భీమవరం ఎంపీడీఓ గా బదిలీపై వచ్చిన వెంకట లక్ష్మి, కొయ్యలగూడెం నుంచి వీరవాసరం ఎంపీడీఓ గా బదిలీపై వచ్చిన కుంజా జ్యోతి లు స్థానిక క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎంఎల్ఏ గ్రంథి. శ్రీనివాస్ ను కలిసి పుష్పగుచ్చాలందించారు.

Read also ; ధైర్యంతో వైద్యం….నిలబడిన ప్రాణాలు

ఈ సందర్భంగా ఎంఎల్ఏ ఎంపీడీఓ లతో మాట్లాడారు. మండల పరిధిలోని గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఎల్ఏ గ్రంథి. శ్రీనివాస్ సూచించారు