Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ధైర్యంతో వైద్యం….నిలబడిన ప్రాణాలు

ధైర్యంతో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ డాక్టర్ రాజకుమార్,

గార్ల, జూన్ 11, నిజం న్యూస్:-

ప్రభుత్వ డాక్టర్లు అపస్మారక స్థితిలో ఉన్న మనుషులను కాపాడాలంటే భయంతో పై హాస్పిటల్ కి వెళ్ళండి లేదా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళండి అని ఉచిత సలహాలు ఇస్తున్న ఈ రోజులలో, ఈ మధ్యలోనే గార్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ ధైర్యంతో అనేక ప్రాణాలను కాపాడుతున్నారు.

అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న
గార్ల మండల పుల్లురు పంచాయతీకి చెందిన సూర్య తండా వాసి బానోత్ జేత్రాం గత ఒక సంవత్సరం పైగా కడుపులో నీరు చేరి పొట్ట ఉబ్బరంతో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగీ మూడు, లక్షలకు పైగా ఖర్చు చేసుకుని ఏమి చేయలేని స్థితిలో ఆ నిరుపేద గిరిజన కుటుంబం దిక్కు తోచని స్థితిలో పొట్టలో చేరిన ఫ్లూయిడ్ వల్ల పొట్ట ఉబ్బీ శ్వాస తీసుకోలేని అత్యవసర పరిస్థితుల్లో బాధపడుతున్న జేత్రామును సీఎంపీ శ్రీనివాస్ , హారి నాయక్, ధైర్యంతో వైద్యం చేస్తున్న డాక్టర్ రాజకుమార్ జాదవ్ ను సంప్రదించాలని

ఇది కూడా చదవండి…ఐఫోన్ 13, 128GB కేవలం రూ.58,749 లకే

ఆలోచనతో స్థానిక గార్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి కి తరలించిన, వెంటనే విషయం చెప్పగా, ధైర్యంతో స్పందించిన ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆ జబ్బు అసైటిక్ సమస్య గా గుర్తించి తన పొట్టలో జమ కాబడిన పెరితోనియల్ ఫ్లూయిడ్ నీ రెండు దఫాలుగా మొదట 2 లీటర్ లు తరువాత రోజూ 3 లీటర్ ల చొప్పున బయటకు తీసివేయడం జరిగినది.
అనంతరం పొట్ట ఉబ్బరం తగ్గి స్వేచ్ఛగా శ్వాస తీసుకొనే అట్టి జేత్రాం మామూలు పరిస్థితి తెచ్చి డాక్టర్ రాజకుమార్ మామూలు మనిషిగా చేస్తూ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గార్ల హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి రెండు మూడు నెలల లోపలనే మూడు, నాలుగు, ప్రాణాలను కాపాడడం, అనేకమంది పేషెంట్ ఆస్పత్రికి రావడం, డాక్టర్ రాజకుమార్ జాదవ్ ను గార్ల వివిధ పార్టీల నాయకులు, ప్రజాపతి నిధులు, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థ కలిగిన వారందరూ డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లడుతూ అనవసరంగా కార్పోరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగీ డబ్బులు వృథాచేసుకో వద్దనీ, ఏలాంటి సమస్య ఉన్న ఉచితంగా ప్రభుత్వ ఆసుత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలనీ డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ అన్నారు.