Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తగ్గేదేలే అంటున్న గోళిసోడా

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.(చల్లా శ్రీనివాస్
నిజం చెపుతాం.. రిపోర్టర్..)జూన్11..
నిజం చెపుతాం న్యూస్..

కొన్ని విషయాలు ఎప్పటికీ పాతబడవు.అవి ఎన్ని రోజులు మారిన కొత్తగానే ఉంటూ అందరినీ ఆకట్టుకుంటాయి. అటువంటి కోవలోకి చెందిన విషయమే గోళిసోడా.

90వ దశకం వరకు ఒక ప్రత్యేక పానీయంగా గుర్తింపు పొందిన గోళీసోడా అప్పట్లో అందరిని అనేక రకాలుగా ఆకర్షించేవి కడుపు ఉబ్బరగా ఉన్న,ఆహారం జీర్ణం కాకపోయినా, ఆఖరికి ఇంటికి చుట్టాలు వచ్చిన మర్యాదగా వారికి ఇవ్వడంలో మొదట గుర్తుకు వచ్చే గోళీసోడా తన హవాను బలంగా చూపించి,తదనంతరం అనేక కారణాల వల్ల, ప్రత్యేకించి శీతలపానీయాల పోటీ తట్టుకోలేక,అలాగే వినియోగదారుల అభిరుచి మారడం వల్ల,మార్కెట్ లేకపోవడంతో
కనుమరుగయింది.

ఇది కూడా చదవండి…భారతదేశ కళలను ఆదరించాలి

అప్పట్లో గోళీ సోడా తయారీ కూడా క్లిష్టంగా ఉండేది. ఒకోసారి ప్రమాదాలు సంభవించిన సందర్భాలు కూడా ఉండేవి కాని మళ్ళీ ట్రెండ్ మార్చి గోళి సోడా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది.

ఆధునిక అభిరుచులకు అనుగుణంగా స్ట్రాబెరి, లెమన్, పైనాపిల్, మ్యాంగో,ఆరంజ్ తదితర ప్లేవర్స్లో చూపరులను ఆకట్టుకుంటుంది.ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో గోళి సోడా తన హవా కొనసాగిస్తూ “తగ్గేదెలే” అంటూ పూర్వ వైభవం చూపిస్తుంది.

జిల్లాల్లో పలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ గోళిసోడా యూనిట్స్ నెలకొల్పడం గమనార్హం. అలాగే ప్రస్తుతం ఆధునిక మెషినరీ వల్లన గోళీసోడా తయారీ సులభ తరం కావడమే కాకుండా సురక్షితంగా ఉంటుంది అని తయారీదారులు చెపుతున్నారు.

మొత్తం మీద గోళీ సోడాలు ఈ మండు వేసవిలో ప్రయాణీకుల దప్పిక తీరుస్తూ కూల్ కూల్ సమ్మర్ స్పెషల్ గా అందరీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.