Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారతదేశ కళలను ఆదరించాలి

భారతదేశ కళలను ఆదరించాల్సిన బాధ్యత అందరిమీద ఉంది.

మాజీ మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు.

ధర్మవరం జూన్ 11 (నిజం చెపుతాం): భారతదేశ కళలను ఆదరించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వేసవి సెలవుల్లో 49 రోజులు పాటు కూచిపూడి భరతనాట్యం జానపద 59 మంది విద్యార్థులకు నేర్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వేసవి నాట్య శిక్షణ శిబిరం ముగింపు కార్య క్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు, 16వ వార్డు కౌన్సిలర్ తీర్థాల స్వర్ణలత పాల్గొన్నారు. ఈ వేసవి నాట్య శిక్షణ శిబిరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యాచార్యులు బాబు బాలాజీ, కమలా బాలాజీ ల ఆధ్వర్యంలో జరిగాయి.

ఇది కూడా చదవండి…ఉపాధ్యాయుని కిడ్నాప్ చేసిన.. మావోయిస్టులు

59 విద్యార్థినిలచే 33 నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. నాట్యం చేసిన వారికి ముఖ్య అతిథులు చేతులమీదుగా మెమెంటోలు సర్టిఫికెట్లను వారు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, వార్డు ఇంచార్జ్ నాయకులు తీర్థాల రమణ, రామలాలిత్యా, విద్యార్థుల తల్లిదండ్రులు, నృత్య కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.