Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాలింత మహిళ ఆపరేషన్ పై నిర్లక్ష్యం

బాలింత మహిళ ఆపరేషన్ పై నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

సమయపాలన పాటించని వైద్యులను వెంటనే తొలగించాలి

ఆస్పత్రి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆస్పత్రి పర్యవేక్షకులను వెంటనే సస్పెండ్ చేయాలి

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి

బాధిత మహిళకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం న్యాయం చేయాలి

మహబూబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలని డిమాండ్

బోడ రమేష్ నాయక్

లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు

మహబూబాబాద్ జిల్లా ప్రతినిది జూన్ 11 నిజం న్యూస్

మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు వివిధ కుల సంఘాలతో పాటు లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా కమిటీ బాధితులకు మద్దతుగా న్యాయం చేయాలని ధర్నాకు దిగడం జరిగింది నిన్న శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామానికి ఎస్సీ కులానికి చెందిన మందుల నవీన్ భార్య అయిన నేహకు ఆపరేషన్ చేయించాలని మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది

నిన్న రాత్రి ఆపరేషన్ జరిగే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యం వహించినందుకుగాను బాలింత మహిళ నేహా ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి బాధ్యులైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలి

మరియు తరచుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ సంఘటనలతో పాటు అవినీతి అక్రమాలకు మద్దతునిస్తున్న ఆసుపత్రి పర్యవేక్షకులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు

మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపై విచారణ చేసి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే వైద్యులు సమయపాలన పాటించకుండా ఆస్పత్రిలో ఉండే పేషెంట్లకు ఇబ్బందికి గురిచేస్తు వాళ్లే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే విధంగా చేస్తున్నారు

దీనిపై ఆస్పత్రి పర్యవేక్షకులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు కనుక ఆస్పత్రి పర్యవేక్షకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ బాధిత మహిళ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉబ్బపల్లి శ్రావణ్ అసెంబ్లీ కార్యదర్శి సీత సాయికిరణ్ శ్రీనివాస్ ఎల్ హెచ్ పి ఎస్ పార్లమెంట్ ఇంచార్జ్ వినోద్ నాయక్ జిల్లా నాయకులు విష్ణు నాయక్ మరియు బాధిత కుటుంబం తదితరులు పాల్గొన్నారు