Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విధ్యార్దులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్, టిఫిన్ బాక్సు, జామెంట్రీ బాక్స్ లు పంపిణీ

అఖిల గాండ్ల తెలికుల సంఘం వైస్ ప్రెసిడెంట్ దూది. వీర్రాజు

కశింకోట నిజం న్యూస్

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం లో నున్న తెలికుల కులం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు బ్యాగ్ లు టిఫిన్ బాక్స్ లు జామెంట్రీ బాక్స్ లు ఆదివారం పంపిణీ చేస్తామని అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ దూది. వీర్రాజు తెలిపారు.

కశింకోట మండలం తాళ్ళపాలెం సంత గంగమ్మ తల్లి ఆలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ పంపిణీ కార్యక్రమం సంఘం జిల్లా అధ్యక్షులు గండేపల్లి. వెంకటరావు, నాయకులు భీమవరపు . శ్రీనివాస్ తాను కలిసి చేస్తున్నామని చెప్పారు.

ఒకటి నుంచి 9 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కార్యక్రమానికి హజరు కావాలని దూది. వీర్రాజు కోరారు.