చేపలతో చెప్పలేనన్ని లాభాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం , జూన్ 10,( నిజం చెపుతాం ) బ్యూరో:
చేపలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చేపలు మంచి రుచికరమైన ఆహారం. చేపలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. చేపలలోని పోషకాలు మెదడు, నాడీ వ్యవస్థను, ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. చేపలలోని గుండె, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి…ఉత్తమ మున్సిపాలిటీగా నారాయణఖేడ్
అందుకే వారానికి రెండు సార్లు మన డైట్లో ఏదో ఒక రూపంలో చేపలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపలు తినడం వల్ల వంటికి ఉపయోగపడే (కరిగిపోయే) క్రొవ్వు శరీరానికి పడుతుంది.
చేపలు తినడం వల్ల శరీరంలో కాల్షియం శాతం పెరుగుతుంది. దానివల్ల ఎముకలు దృఢంగా ఉండటంతో పాటు వెన్నుపూస కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చేపలు తినడం వల్ల మొహం, శరీరం కాంతివంతంగా మారతాయి.
చేపలు ఎవరు తినకూడదు?
చర్మ వ్యాధులు ఉన్నవారు, క్షయ వ్యాధి గ్రస్తులు చేపలను దూరం పెట్టాలి. అలాగే కళ్ళ కలక ఉన్నవాళ్లు కూడా చేపలు తినకూడదు. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెజర్ ఉన్నవాళ్లు ఎండు చేపలను తినడం మంచిది కాదు.
చేపలు తినడం గురించి కొంత మంది విషయంలో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ చేపలు నూటికి నూరు శాతం చేపలు మంచి పౌష్టికాహారం, సమీకృత ఆహారం అని చెప్పవచ్చు.
చేపలు మనిషికి చక్కని ఆరోగ్యాన్నిస్తాయి.