బస్టాండ్ పక్కనే ఉన్న హోటల్లో తనిఖీలు
ప్రయాణికుల ఆరోగ్యం ద్రుష్టిలో ఉంచుకొని బస్టాండ్ పక్కనే ఉన్న హోటల్లో తనిఖీలు..
సంగారెడ్డి సదాశివపేట జూన్ 10 ( నిజం చెపుతాం )
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న గ్రీన్ బావార్చి హోటల్ ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో కల్తీ ఆయిల్ నిల్వ ఉంచిన డబ్బాలు , కనబడగానే , హోటలంతా తిరిగిచూశారు, అక్కడ మాంసం, మసాలాలు, పాడైపోయిన పదార్థాలు కనబడ్డాయి,
వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ కు శాంపిల్స్ ని పంపించారు. సంబంధిత అధికారులు హోటల్ కి నోటీస్ జారీ చేశారు.
మీడియాతో మాట్లాడిన ఆయన తగిన చర్యలు చేపడతామని అన్నారు