పాఠశాలలకు ఉచిత మెడికల్ కిట్ పంపిణీ
పాఠశాలలకు ఉచిత మెడికల్ కిట్ పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే
విద్యార్థులకు ఉచిత మెడికల్ కిట్లు అందజేయడం అభినందనీయం
జగిత్యాల, జూన్ 10 (నిజం చెపుతాం).
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత మెడికల్ కిట్ల పంపిణీ చేయడం అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
సామాజిక భద్రత కోరుకునే ఉద్యోగి సామాజిక బాధ్యత నిర్వహించాలి అని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఎస్సీపిఎస్ఈ యు జగిత్యాల జిల్లా శాఖ, ఎమ్మెస్బిఏడిఐ డాట్ కం సంయుక్తంగా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ చికిత్స కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఇది కూడా చదవండి…భూపాలపల్లి బిఆర్ఎస్ లో సీటు కొట్లాట..!
ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెస్ బి ఏ డి ఐ డాట్ కం ఆర్థిక సహకారం తో ఉచిత మెడికల్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషకరం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ బడి నిర్వాహకులు మాచర్ల నవీన్ మహేష్, టి ఎస్సీపిఎస్ఈయు నాయకులు మ్యాన పవన్ కుమార్,గంగాధరి మహేష్,సర్వ సతీశ్,గొల్లపల్లి మహేష్ గౌడ్,బోగ శ్రీనివాస్,సిర్ర శ్రీనివాస్,శంకర్,సుధాకర్,రవి, పి ఆర్ టి యు నాయకులు యళ్ళ అమర్నాథ్ రెడ్డి,బోయినపెళ్లి ఆనందరావు,రాపర్తి నర్సయ్య, టిఆర్టిఎఫ్ నాయకులు తుంగూరి సురేష్,విజయనంద్,రవీందర్ ఎస్ టి యు నాయకులు బైరం హరికిరన్,మచ్చ శంకర్, టిపియూఎస్ నాయకులు ఓడన్నాల రాజా శేఖర్, బి టి ఎఫ్ నాయకులు శంకర్, వివిధ సంఘాల భాద్యులు పొన్నం రమేష్,తాటిపాముల రమేష్,కల్వకోట కార్తీక్,కుంబల శ్రీనివాస్,ఎలిగేటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.