Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంత్రి చెతిపై కేసీఆర్ పేరు పచ్చ బొట్టు

గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ పై అభిమానం చేతిపై చేరి శాశ్వతమైన క్షణం

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కృతజ్ఞతతో మంత్రి సత్యవతి రాథోడ్ చేతిపై కేసీఆర్ పేరు పచ్చ బొట్టు వేయించుకున్నారు.

నొప్పిని భరిస్తూ అభిమానం చాటుకున్న మంత్రి

గిరిజన యోధుడు కొమురం భీమ్ సహచరుని వారసులతో పచ్చబొట్టు

మహబూబాబాద్ బ్యూరో జూన్ 10 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు బంజారహిల్స్ లోని రోడ్ నెం10 బంజారా భవన్, లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఆదివాసి,బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను మంత్రి సందర్శించారు.

ఆకట్టుకున్న గిరిజన సాంస్కృతిక కార్యముక్రమాలు

గిరిజన స్టాల్స్ ను సందర్శిస్తున్న మంత్రి కి అక్కడ స్టాల్స్ నిర్వాహకులు వాటి ప్రత్యేకతలను వివరిచారు. అదే సమయంలో పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ గారు తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని సూచించారు. నిర్వాకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా మంత్రి కేసీఆర్ పేరును వేయాలి అని వారికి తెలిపారు. నొప్పిని భరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రి గారికి పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు. పచ్చబొట్టు వేసినందుకు నగదు బహుమానం అందించారు.

అంతరించిపోతున్న గిరిజన సాంస్కృతులను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మంత్రి పేర్కొన్నారు.