అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
హైదరాబాద్ జూన్ 10 నిజం చెబుతాం న్యూస్
హైదరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వంగాల దానయ్య వారితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
Also read: మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తో గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు