మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్
చర్ల జూన్ 9 (నిజం చెపుతాం ) మావోయిస్టు దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్ లక్ష్మి (29) చర్ల పోలీసులు. సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సంయుక్తంగా తాళి పేరు డ్యాం వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు
ఈమె సతీష్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్పల్లి గ్రామం 15 సంవత్సరాల వయసులో 2008 సంవత్సరంలో దండకారణంలోని మావోయిస్టు పార్టీ పశ్చిమ భస్తర్ డివిజన్ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సెక్రటరీ మాధవి అనే మావోయిస్టు గార్డుగా ఈమె పని చేసింది
2008 నుండి 2014 వరకు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ లో సభ్యురాలుగా పనిచేస్తూ డబల్ బ్యారెల్ తుపాకి కలిగి ఉంది అనంతరం 2014లో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ఆమెను పశ్చిమ బస్తర్ నుంచి పాత బస్తర్ డివిజన్ కు బదిలీ చేస్తూ పామేడ్ ఏరియా కమిటీ అటాచ్మెంట్ కుచేర్చారు
అనంతరం సంవత్సరం తర్వాత 2017లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ఆమెను ఎల్ వో ఎస్ కమాండర్ గా నియమించారు 2015 నుండి ఇప్పటివరకు ఈమె సతీష్ గడ్ లోని పామేడ్ ఏరియా ఎల్ ఓ ఎస్ కమాండర్ గా పనిచేస్తూ ఇన్పస్ తుపాకి కలిగి ఉండేదని పోలీసులను హతమార్చే ఉద్దేశంతో ఇతర మావోయిస్టుదళ సభ్యులతో కలిసి తాలి పేరు డ్యాం వద్దకు వస్తుండగా ఆమెను పట్టుకోవడం జరిగిందని మిగిలిన వారు పోలీసులను చూసి పారిపోయారని ఎస్పితెలిపారు
ఇది కూడా చదవండి….సబ్సిడీపై జీలుగు విత్తనాలు పంపిణీ
వారి వద్ద నుండి మూడు కేజీల సామర్థ్యం గల స్టీల్ క్యాంన్.జిలిటిన్ సి క్స్5. ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఒకటి చిరంజీవి 2. బ్యాటరీ 4 కాంప్లెక్స్ వైర్ 50 మీటర్లు రెండు బండి లు. ఎలక్ట్రిక్ వైర్ 30 మీటర్లు ఒక బండి ల్. స్వాధీనం చేసుకున్నారని అన్నారు
ఈమె తెలంగాణ సతీష్ గడ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం సతీష్ గడ్ కు చెందిన పామేడు కిష్టారం ఊసూరు భాష గూడెం తర్రెం పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం చర్ల దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఏరియాలో పలు విధ్వంసం ఘటనలో పాల్గొనడం జరిగిందని
కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై దాడులు సిఆర్పిఎఫ్ క్యాంపులపై తుపాకులతో దాడుల ఘటనలతో పాటు ఆదివాసీలను ఇన్ ఫార్మర్ నేపథంతో హతమార్చిన పలు ఘటనల్లో కీలకంగా వ్యవహరించిందని తెలిపారు సతీష్ గడ్ పోలీస్ స్టేషన్లలోనూ తెలంగాణ పోలీస్ స్టేషన్ చర్ల దుమ్మగూడెం స్టేషన్లో 30 కేసులు నమోదైనట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పారితోజ్ పంకజ్ ఓ ఎస్ డి సాయి మనోహర్ సిఆర్పిఎఫ్ కమాండెంట్లు. ఎస్సై సూరి తదితరులు పాల్గొన్నారు