సబ్సిడీపై జీలుగు విత్తనాలు పంపిణీ
చర్ల జూన్ 8 ( నిజం చెపుతాం) రైతులకు సత్యనారాయణపురం సొసైటీ లో గురువారం సబ్సిడీ పై జీలుగు విత్తనాలను సర్పంచ్ సోడి పుల్లయ్య ఎంపీపీ కోదండ రామయ్య సొసైటీ ఉపాధ్యక్షులు ఆళ్ల నాగరాజు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి ఏవో శివరాం ప్రసాద్ మాట్లాడుతూ జీలుగు విత్తనాలు 125. 40 క్వింటాలు రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని ఒక బ్యాగ్ పూర్తి ధర 30 కేజీలు రూ 2407. సబ్సిడీపై 1. 564 రూపాయలకు రైతు వాటా చెల్లించాలని తెలిపారు
ఇది కూడా చదవండి….చరవాణి ముసుగులో చిట్టీల దందా
రైతు పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తో ఏ ఈ ఓ దగ్గర టోకెన్ పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు ఒక ఎకరానికి 12 నుండి 15 కేజీల విత్తనాలు 24 గంటలు నానబెట్టి సల్లుకోవాలని 45 రోజులు వయసులో పొలాన్ని కలియదున్నాలని దీనివలన నత్రజని నేలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు
వానాకాలం వరి మిరప పంటలకు ముందుగానే పచ్చిరొట్ట ఎరువు వేసుకుంటే భూ హారాన్ని పెంచి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో రైతులు సంజీవరెడ్డి ఇందుల రమేష్ ఇందుల బుచ్చిబాబు సత్యనారాయణరాజు లక్ష్మీపతి రాజు ఆవుల విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు