పులుసుబొంత ప్రాజెక్టు త్వరలో ఫారెస్ట్ అనుమతులు:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

పినపాక నియోజకవర్గాన్ని సశ్యసమలం చేసే పులుసుబొంత ప్రాజెక్టు కింద నష్టపోయిన అడవి స్థానంలో తిరిగి అంతే భూమిని జూలూరూపాడ్ మండలంలో 300 ఎకరాల ప్రభుత్వభూమిని ఫారెస్టు శాఖ కు కేటాయించినున్న నేపథ్యంలో కొత్తగూడెం డి ఎఫ్ ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్ పరిశీలించారు.ఫారెస్ట్ శాఖ కి భూమి అప్పగించిన వెంటనే త్వరలో ఫారెస్ట్ అనుమతులు వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆశాభావం వ్యక్తం చేశారు అనుకున్న గడువులోపే పులుసు బొంత పనులు ప్రారంభం అవుతాయని విప్ రేగా కాంతారావు మన్యం మీడియా కి తెలిపారు.