చరవాణి ముసుగులో చిట్టీల దందా
-అనుమతులు లేకున్నా అక్రమ ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం
-తుంగలో రిజర్వ్ బ్యాంకు నిబంధనలు
-రూ.లక్షల్లో అక్రమ లావాదేవీలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 9 నిజం చెపుతాం
మండలంలో ప్రైవేటు వ్యాపారుల చిట్టి దందా మితిమీరిపోతుంది. ప్రైవేట్ ఫైనాన్స్‌లు ఇవ్వడమే కాకుండా అనధికార చిట్టీ వ్యాపారాలు కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోయినా ప్రైవేటు చిట్టిల దందా కొనసాగిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండవలసిన కొందరు వ్యక్తులు చరవాణి ముసుగులో అక్రమ సంపాదన ధ్యేయంగా చిట్టీల దందా జోరుగా కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి….నాణ్యత లేక నాశనం అవుతున్న రోడ్లు
రిజర్వ్ బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి చిట్స్ ద్వారా ఫైనాన్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించకుండానే గుట్టుగా జీరో దందా నడిపిస్తున్నారు. నమ్మకం అనే ముసుగులో ప్రజల నుండి లక్షల రూపాయలను జమ చేసుకుంటున్నారు..
మొగుళ్లపల్లి మండలంలో జోరుగా జీరో దందా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. డబ్బు అవసరమున్న వారికి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.5 నుండి రూ.10 వరకు ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్న పరిస్థితి.
కొంత మంది ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలను పక్కన పెట్టి జీరో దందాలు నడిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉన్న చిట్స్ రిజిస్ట్రార్ వద్ద అనుమతి పొందిన వారు మాత్రమే రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని కొనసాగించాలి.
కానీ మండలంలో అనుమతి లేని చిట్టీ వ్యాపార కేంద్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు తమకు తెలిసిన వారితో చిట్టీలు వేయించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న సంఘటనలు ఉన్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి చిట్స్, రిజిస్ట్రేషన్ అనుమతి లేని చిట్టీలు నడిపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.