Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ

ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట జూన్ 9 నిజం న్యూస్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట పట్టణంలో నూతనంగా వికలాంగుల కోసం మంజూరైన ఎలక్ట్రిక్ సైకిళ్లను వ్యవసాయ మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే ,నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజ్ శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల కోసం 100 సైకిళ్లు మంజూరు కాగా అర్హులైన 72 మంది వికలాంగ లబ్ధిదారులకు అందజేశారు.

ఇది కూడా చదవండి…హుజూరాబాద్ లో మహారాష్ట్ర సర్పంచ్ ల పర్యటన

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అండగా ఉంటున్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు ,నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.