Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హుజూరాబాద్ లో మహారాష్ట్ర సర్పంచ్ ల పర్యటన

జమ్మికుంట, జూన్ 9 (నిజం చెపుతాం)

ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర వైద్యా, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల అనుసారం శుక్రవారం మహారాష్ట్ర సర్పంచ్ లు మరియు రైతుల బృందానికి హుజురాబాద్ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి పనులను, దళిత బంధు ఎలా అందిస్తున్నారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను, అభివృద్ధి పనులను మహారాష్ట్ర బృందానికి క్లుప్తంగా వివరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు బి ఆర్ ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి .

హుజురాబాద్ నియోజకవర్గం లో వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో గ్రామా పంచాయితీ భవనం ప్రారంభించుకొని, చల్లూర్ గ్రామం, జమ్మికుంట పట్టణం,హుజురాబాద్ పట్టణంలో దళిత బంధు యూనిట్స్ ని చూపెట్టి ఆ తర్వాత హుజురాబాద్ మార్కెట్ యార్డులో సంక్షేమ సంబరాలు మీటింగ్ లో పాల్గొన్నారు.
మహారాష్ట్ర సర్పంచ్ లు మాట్లాడుతూ మహారాష్ట్ర లో పంటలకు నీరు లేక ఏడారిగా మారడం తో రైతులు ఆత్మహత్య లు చేసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించుకొని రైతన్నల గోస తీర్చారు కెసిఆర్.

మహారాష్ట్ర కు చెందిన రైతుల బృందం,సర్పంచుల బృందం పర్యటించి పలు అభివృద్ది పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.
అలాగే దళిత బంధు దళితులందరికి అందరికి 10 లక్షలు 18000 మందికి ఇచ్చి దేవుడ అయ్యాడు కెసిఆర్ . మా రాష్ట్రం లో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కానీ తెలంగాణ లో ప్రాజెక్ట్ ల నిర్మాణంతో మూడు పంటలు దేశం లో ఎక్కడ లేని విధంగా సిఎం కేసీఆర్ నిర్మాణం చేపట్టారని అన్నారు.

ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం రైతులకు వరమని , మా వద్ద రాత్రి పూట మాత్రమే కరెంట్ ఇస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని , మా మహారాష్ట్ర లో పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇంట్లో పెట్టుకోవడం బాధాకరమని అన్నారు.

ఇది కూడా చదవండి….పేద అమ్మాయిల వివాహల్లో మేము పాలు పంచుకుంటాం

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన తాగుడు అందించడం చాలా అద్భుతం అని మహారాష్ట్ర రైతులు తెలిపారు,

కానీ మా మహారాష్ట్ర రాష్ట్రంలో త్రాగడానికి నీళ్లు లేక చాలా దూరం వెళ్లి నీరును త్రాగడానికి సేకరిస్తున్నామని బాధను వ్యక్తం చేశారు,
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి అద్భుతం .

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నుండి పాల్గొన్న వారు

సర్పంచ్ పరిషత్ ముంబై , ప్రెసిడెంట్ దత్త కక్డే , బాలా సనాబ్,వికాస్ జాదవ్,గణేష్ పాటిల్,సుష్మ దేశ్లే మార్కెట్ డైరక్టర్, అతుల్ చౌదరి,పర్వీన్ కిరొడకర్,కల్యాణి పాటిల్.