Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్యాటరీలో మంటలు… వడ్ల లారీ దగ్ధం

వడ్ల లారీ దగ్ధం
బ్యాటరీ షాట్స్ తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
కౌట్ల బి గ్రామం నుండి భైంసా పట్టణానికి వెళ్తుండగా ఘటన
సిర్గాపూర్ గ్రామానికి చేరుకోగానే బ్యాటరీ నుండి పొగ రావడంతో గమనించిన డ్రైవర్
పక్కనే చెరువులో నుంచి నీళ్లు తీసుకువచ్చే లోపల చిల్లరేగిన మంటలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూన్ 09
(నిజం చెపుతాం)
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల్ సిర్గాపూర్ గ్రామంలో ఐకెపి వడ్ల లారీ దగ్ధమైనట్టు సమాచారం మేరకు సారంగాపూర్ మండల్ కౌట్ల గ్రామంలో గల రైతుల వడ్లు లారీలో లోడ్ చేసుకుని TS16,UC,1575 గల లారీ సిర్గాపూర్ గ్రామానికి చేరుకోగానే

బ్యాటరీ నుండి ఒక రావడంతో లారీ నడిపిస్తున్న డ్రైవర్ గమనించి ఒక్కసారిగా లారీని ఆపివేసి పక్కన ఉన్న చెరువులో నుంచి నీళ్లు తీసుకువచ్చే లోపల పెద్దగా మంటలు చెలరేగాయని డ్రైవరు చెబుతున్నారు యొక్క సంఘటనలో భాగంగా లారీ ముందు భాగం పూర్తిగా ఖాళీ బూడిదైందని డ్రైవర్ తెలిపారు

ఇది కూడా చదవండి…దివ్యాంగుల పెన్షన్ పెంపు

వెనుక భాగంలో గల వడ్లు కూడా దాదాపు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు కాలిపోయాయని తెలిపారు ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రజలు మరియు లారీ డ్రైవర్ తెలిపారు

సమాచారం తెలుసుకున్న దిల్వార్పూర్ మండల్ ఎస్సై గంగాధర్ ఎమ్మార్వో కలీం సంఘటన స్థలానికి చేరుకొని పంచినామా నిర్వహించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు