బడి బాటను విజయవంతం చెయ్యాలి
-టిఎస్ యూటిఎఫ్
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూన్ 09, (నిజం చెపుతాం)
బజార్హత్నూర్ మండలం లోని కిన్నెరపల్లె లో ఈ రోజు టిఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమం విజయవంతం చెయ్యాలని టిఎస్ యూటిఎఫ్ బజార్హత్నూర్ మండల ప్రధాన కార్యదర్శి కాంబ్లే విజయ్ కుమార్ పిలుపునీచ్చారు.
ఇది కూడా చదవండి….లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు!!
ప్రభుత్వ పాఠశాల లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్ లు, ఒక జత ఉచిత దుస్తులు, అలహాదా కరమైన వాతావరణం లో బోధన వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాల లో అదుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చర్పించాలని పిలుపు నీచ్చారు.
ఈ కార్యక్రమం లో టి ఎస్ యూ టి ఎఫ్ బజారుహత్నూర్ మండల ప్రధాన కార్యదర్శి కాంబ్లే విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు గండ్రత్ శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.