హైదరాబాద్‌లో అందుబాటులో 53 బోట్లు
హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను ప్రభుత్వం తెప్పించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం 53 బోట్లను హైదరాబాద్‌కు తెప్పించింది. రాష్ర్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 5 బోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.