Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణకు 12 ఏపీకి 5 వైద్య కళాశాలలు మంజూరు

మహబూబాబాద్ బ్యూరో జూన్ 09 నిజం న్యూస్

దిల్లీ: దేశంలో మరో 50 వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణకు 12, ఏపీకి 5 వైద్య కళాశాలలు కేటాయించింది.

తెలంగాణలోని మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్ లో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది.

మేడ్చల్-మల్కాజిగిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్ లో సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్ కొలంబో ట్రస్ట్ ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి.

ఏపీలో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.