Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వివాహ కోసం పుస్తెలు, మట్టెలు అందజేత

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తెలు,మట్టెలు అందజేత

సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా.

సూర్యాపేట ప్రతినిధి జూన్ 7 నిజం చెబుతాం న్యూస్

భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియజేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్టు పనిచేస్తుందని ట్రస్టు కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సదా ట్రస్ట్ సేవా మందిరంలో ఆర్థికంగా వెనుకబడిన కూరగాయల వ్యాపారం చేస్తున్న బత్తుల వరలక్ష్మి కూతురు బత్తుల పావని వివాహ నిమిత్తం దాతలు మిర్యాల శివకుమార్, కవితల ఆర్థిక సహకారంతో మంగళసూత్రం మెట్టెలు అందజేసి మాట్లాడారు.

శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ ఆశీర్వాదంతో ఆ ట్రస్టు అధ్యక్షులు సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణలో దాతల సహకారంతో ఇప్పటివరకు 82 మంది వివాహం చేసుకుంటున్న వధువులకు పుస్తెలు, మెట్టేలు అందజేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి….వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి లక్ష జనహారతి

కేవలం ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 49 మంది వధువులకు పుస్తే ,మెట్టేలతోపాటు నూతన వస్త్రాలు అందజేసినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన హిందూమతంలోని నిరుపేద కుటుంబాలకు చెందినవారు వివాహం చేసుకునే వారు పెళ్లి పత్రిక, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో మా కార్యాలయంలో సంప్రదించినట్లయితే పుస్తెలు,
మెట్టేలు అందజేయనున్నట్లు తెలిపారు.

ఎవరైనా దాతలు పుస్తెలు, మెట్టేలు ఇవ్వదలుచుకున్నట్లయితే సంప్రదించాలని కోరారు